
అభిషేక్ సింఘ్వీది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సింఘ్వీ వల్ల రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని తెలిపారు. అభిషేక్ సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన డా. కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఈ ఖాళీ భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 21వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉంది. ఒకే నామినేషన్ వచ్చినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. లేదంటే వచ్చే నెల 3వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
అంతకుముందు హైదరాబాద్ నానక్‌రాంగూడలోని ఓ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సీఎం వారందరినీ పార్టీ రాజ్యసభ ఉపఎన్నిక అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీని పరిచయం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలులో అనేక రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని పేర్కొంటూ వీటి పరిష్కారం కోసం రాజ్యసభలో, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సింగ్వి సహకరిస్తారని చెప్పారు.
More Stories
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం