ఎటువంటి కారణం లేకుండా బంగ్లాదేశ్‌లో హిందువులు లక్షిత దాడుల కారణంగా హిందువులకు గురవుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఎలాంటి అన్యాయం, దౌర్జన్యాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన దేశంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాగపూర్ మహల్ ప్రాంతంలోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంగురవేసిన అతరం ఆయన మాట్లాడారు. “రాబోయే తరానికి ‘స్వతంత్రత’ (స్వేచ్ఛ) ‘స్వా’ను రక్షించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు ఉంటారు. మనం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి,” అని ఆయన పిలుపిచ్చారు.
పరిస్థితి అన్ని వేళలా ఒకేలా ఉండదని చెబుతూ కొన్నిసార్లు ఇది మంచిది అయినా ఇతరులకు అంత మంచిది కాకపోవచ్చని, ఈ హెచ్చు తగ్గులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. “మనం ఇప్పుడు పరిస్థితిని చూడవచ్చు. పొరుగు దేశంలో చాలా హింస జరుగుతోంది. అక్కడ నివసించే హిందువులు ఎటువంటి కారణం లేకుండా దాడులను ఎదుర్కొంటున్నారు” అని బంగ్లాదేశ్ పేరు చెప్పకుండా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“భారతదేశంలో ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం ఉంది. గత కొన్నేళ్లుగా భారతదేశం ఎవరిపైనా దాడి చేయలేదని, మనతో ఎలా ప్రవర్తిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేస్తుందని మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాము” అని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో మన దేశం సురక్షితంగా ఉండేలా చూడాలని, అదే సమయంలో ఇతర దేశాలకు సాయం అందేలా కూడా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
‘‘అస్థిరత, అరాచకాల వేడిని ఎదుర్కొంటున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అన్యాయం, దౌర్జన్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన దేశంపై ఉంది. సమాజం తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. దేశం పట్ల నిబద్ధతను చూపుతుంది” అని డా. భగవత్ విశ్వాసం వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన తర్వాత హిందూ మైనారిటీ కమ్యూనిటీపై లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. హసీనా బహిష్కరణ తర్వాత 48 జిల్లాల్లోని 278 ప్రాంతాల్లో మైనారిటీ కమ్యూనిటీ దాడులు, బెదిరింపులను ఎదుర్కొందని బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయన్స్ ఆరోపించింది.
గత వారం షేక్ హసీనా రాజీనామాకు ముందు, తరువాత జరిగిన నిరసనకారుల హత్యలపై దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం త్వరలో బంగ్లాదేశ్‌ను సందర్శించనుందని బుధవారం ప్రకటించారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం
సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన బంగ్లాదేశ్ వాసి అరెస్ట్!