కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్‌ మోహన్‌

కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్‌ మోహన్‌
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా గోవింద్‌ మోహన్‌ నియామకాల కమిటీ బుధవారం నియమించింది. ఆయన సిక్కిం కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌శాఖలో కార్యదర్శిగా సేవలందిస్తున్నారు.  ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న అజయ్‌ కుమార్‌ భల్లా పదవీకాలం ఈ నెల 22న ముగియనున్నది.
 అప్పటి వరకు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్డి)గా సేవలందించనున్నారు.  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్పెషల్ డ్యూటీ అధికారిగా గోవింద్ మోహన్‌ నియామకానికి కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. భల్లా పదవీకాలం అనంతరం ఆయన హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు. 
అప్పటికి హోం అజయ్‌ కుమార్‌ భల్లా పదవీకాలం పూర్తవుతుందని పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్‌ పెన్షన్ల మంత్రిత్వ శాఖ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 
59 ఏళ్ల మోహన్ ప్రస్తుతం సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఆయన ఈ ఏడాది మార్చి 27 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇంతకు ముందు ఆయన క్రీడలశాఖ కార్యదర్శిగా కొద్దికాలం పాటు సేవలందించారు. 
 
ఇదిలా ఉండగా.. రాబోయే కాలంలో జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. మోహన్‌ ముందు ఎన్నికల కోసం భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించడం తదితర సవాళ్లు ఉన్నాయి. ఎన్నికల సంఘంతో కలిసి ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత, అభ్యర్థుల భద్రత, ఎన్నికల కమిషన్‌ సిఫారసు చేసి మేరకు అవసరమైన భద్రతా సిబ్బందిని సమకూర్చే బాధ్యతను కేంద్ర హోంమంత్రిత్వశాఖకు అప్పగించారు.