తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు పెట్టుబడుల కల్పన ద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనకు దోహదం చేసే పెట్టుబడులు తీసుకరావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభించారు. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల బృందం ఉన్నారు. న్యూయార్క్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ బృందానికి ఘన స్వాగతం లభించింది.
విమానాశ్రయంలో పలువురు ప్రవాస భారతీయులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ అభిమానులు, పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందజేసి ఆహ్వానం పలికారు. న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడంపై రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమతో తమకు స్వాగతం పలకడానికి విచ్చేసారని పెట్టుబడుల సాధన కోసం చర్చలను ప్రారంభించడానికి తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఇప్పటికే ఎవరికి అందనంత ఎత్తుకు చేరిందని చెప్పారు.
అమెరికాలో అన్ని రంగాలను భారతీయులు ప్రభావం చూపుతున్నారని, రియల్ ఎస్టేట్‌ను శాసిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం కోసమే పర్యటన చేపట్టినట్టు చెప్పారు. న్యూయార్క్ నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటన పది రోజుల పాటు సాగనుంది. రానున్న 10 రోజుల్లో అమెరికా, దక్షిణ కొరియాలోని వివిధ నగరాల్లో సమావేశాలు, చర్చలు జరగనున్నాయి. సీఎం పర్యటనలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటారు.
More Stories
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?