 
                రెండ్రోజుల క్రితం బెల్జియం చేతిలో ఓడి ‘పారిస్’లో తొలి ఓటమి రుచి చూసిన భారత హాకీ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతక విజేత, పటిష్టమైన ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో సగర్వంగా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత 3-2తో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. 
ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌కు 52 ఏండ్ల తర్వాత (చివరిసారి 1972 మునిచ్‌లో) ఇదే తొలి విజయం. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతూ దారుణంగా ఓడిన మెన్ ఇన్ బ్లూ కీలకమైన పోరులో మాత్రం జూలు విదిల్చింది. 12వ నిమిషంలోనే అభిషేక్ తొలి గోల్ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తెచ్చాడు. 
వాస్తవానికి గోల్ చేసేందుకు లలిత్ బంతిని గోల్ పోస్ట్ వైపునకు పంపాలని యత్నించినా ప్రత్యర్థి గోల్‌కీపర్ ఆండ్రూ చార్టర్ దానిని అడ్డుకున్నాడు. అయితే అదే సమయంలో అక్కడే ఉన్న అభిషేక్ బంతిని దొరకబుచ్చుకుని రాకెట్ వేగంతో దానిని గోల్‌పోస్ట్‌కు పంపించాడు. ఆ వెంటనే 13వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఈ టోర్నీలో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
 ఆస్ట్రేలియాకూ పలుమార్లు పెనాల్టీ కార్నర్లు లభించినా చివరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ వాటిని విజయవంతంగా అడ్డుకున్నాడు. అయితే 25వ నిమిషంలో టామ్ క్రెయిగ్ గోల్ కొట్టి ఖాతా తెరిచి ఆ జట్టును పోటీలోకి తెచ్చాడు. 
కానీ మూడో క్వార్టర్లో హర్మన్‌ప్రీత్ 33వ నిమిషంలో మరోసారి లభించిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటూ భారత్‌కు మూడో గోల్‌ను అందించాడు. 55వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ గోల్ కొట్టినా అది ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఈ విజయంతో పూల్-బీలో లీగ్ దశను రెండో స్థానం (9 పాయింట్లు)తో ముగించింది. బెల్టియం (12) అగ్రస్థానంలో ఉంది. 





More Stories
చాబహార్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు
ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు