
అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో రూ. 15,000 కోట్లు కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని సాకారం అవుతుందనే ధీమా ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ హర్షం ప్రకటించారు. కొత్త గా ఏర్పడిన ఏ రాష్ట్రానికి ఇవ్వని రీతిలో నిధులు కేటాయించడం డబల్ ఇంజన్ సర్కార్ ద్వారానే సాధ్యం అయ్యిందని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తులో అమరావతి కి ఇంకా నిధులు కేటాయిస్తాం అని చెప్పడం ద్వారా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూల దృక్పధం చూపారని విల్సన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కి పెద్ద పీట వేయడం ద్వారా ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి నట్టయ్యిందని తెలిపారు. రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అదే విధంగా వెనుక బడిన జిల్లాలకి నిధులు కేటాయించడం హర్ష దాయకం అని చెప్పారు.
జగన్ హయాంలో పడకేసిన పోలవరం పనులు ఇక శరవేగంగా నడవడానికి కావాల్సిన సంపూర్ణ సహకారం ఇవ్వడానికి కేంద్రం మరింత తోడ్పాటు అందించడం శుభ పరిణామం అని విల్సన్ తెలిపారు. రాబోయ్యే ఐదేళ్లలో లక్షలాది కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్ కి రానున్నాయని భరోసా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కి లక్షాలది ఇళ్ళు కేటాయించడం ద్వారా పేదల ఇళ్ల కు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పేర్కొన్నారు.
ముద్రా పధకం క్రింద 20..లక్షల వరకూ ఋణ సదుపాయం కల్పించడం ద్వారా బడుగులకు మేలు జరుగుతుంది చెప్పారు. విదేశీ విద్య కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బడుగు విద్యార్థులకు విదేశాలకు వెళ్లి చదువు కొనే అవకాశం కలిగిందని తెలిపారు.
రైతులకు, మహిళలకు పెద్ద పీట వేయడం, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వడం, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వెయ్యడం పట్ల హర్షం ప్రకటించారు. ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేస్తాననడం చాలా ఉపయోగం అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధికి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్టు కాగలదని తెలిపారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు