
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని, పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. దక్షిణాదిలో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యల్పమనే విషయాన్ని గమనంలోకి తీసుకొని రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించాలని సీఎం విన్నవించారు.
అమిత్‌షాతో భేటీ వివరాలను చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ విధ్వంస పాలనపై ఇప్పటి వరకూ విడుదల చేసిన 4 శ్వేతపత్రాల్లోని అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో విపరీతంగా పెరిగిన అప్పుల భారంతో రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిన విషయాన్ని వివరించానని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ దుష్పరిపాలన, విపరీతమైన అవినీతివల్ల ఏపీకి పూడ్చలేని నష్టం జరిగిందని అమిత్‌షాకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తిరిగి పట్టాలెక్కిస్తామని సీఎం పేర్కొన్నారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా