
మళ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి గెలవాలని తెలిపారు. హరీశ్ రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అని కొనియాడారు. హరీష్ రావు మంచి ఉద్యమ నాయకుడని, ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉందని పేర్కొన్నారు. ఆయన మళ్లీ పోటీ చేసినా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
అయితే తాను ఇలా అన్నానంటే హరీష్‌రావు తనకు ఫోన్ చేశారనో, లేక బిజెపిలో చేరుతున్నారనో అనుకోవద్దని తెలిపారు. బిజెపిలో బిఆర్‌ఎస్ విలీనం ఒక డ్రామా అని కొట్టిపారేశారు. ఇప్పటికే బిజెపిలోకి వచ్చేందుకు చాలా మంది బిఆర్‌ఎస్ నుంచి ఎదురు చూస్తున్నారని, అయితే తాము ఎవరిని అడగడం లేదని తేల్చి చెప్పారు.
ఎవరు వచ్చినా రాజీనామా చేసి మళ్లీ గెలవాల్సిందేనని, అయితే గెలిపించుకునే బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ’’అభివృద్ధిని చూసి కాంగ్రెస్లో చేరుతున్నారని మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా, నిజంగా మీరు అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా?’’ అని సంజయ్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.
ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే అధికార పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు. పైకి మాత్రం సిగ్గు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నీతులు వల్లించడం సిగ్గు చేటన్నారు.
కాగా, తెలంగాణ నిరుద్యోగులకు మద్ధతు పలికారు. గ్రూప్2 పరీక్ష వాయిదా వేయాలన్న డిమాండ్ కు అనుకూలంగా మాట్లాడారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైనా తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ నిరుద్యోగులకు ఇచ్చిన ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అంటే ఇదేనా అంటూ నిలదీశారు. వెంటనే నిరుద్యోగులతో సామరస్యపూర్వకంగా చర్చించి, వారి ఆందోళనను విరమింప చేయాలని రేవంత్ రెడ్డి ప్ర భుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే