
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ, కాంగ్రెస్.. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. దీంతో కౌన్సిల్‌లో పరిస్థితులు అదుపులో లేకుండా పోయాయి. ప్లకార్డులు చూపించుకున్న అంశంపై మొదలైన ఈ గొడవ బిజెపి కార్పొరేటర్లపై ఎంఐఎం కార్పొరేటర్లు భౌతిక దాడులకు దిగేవరకు వెళ్ళింది.
దానితో కౌన్సిల్‌ను నియంత్రించాలక ఉద్రిక్త పరిస్థితుల మధ్యే సభ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెళ్లిపోయారు. ఉదయం నుంచి కౌన్సిల్ రచ్చ రచ్చగానే సాగింది.! ఈ దాడి ఘటనపై కౌన్సిల్ హాల్‌లోనే బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనలకు దిగారు. తమ కార్పొరేటర్లపై దాడి చేసిన ఎంఐఎం కార్పొరేటర్లు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోడియం ముందు కూర్చుని బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కౌన్సిల్ హాల్ లోపల భారీగా మార్షల్స్ మోహరించారు. అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లకు మార్షల్స్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
తొలుత కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ ఎస్ కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మేయర్ విజయలక్ష్మికి, కార్పొరేటర్లకు వాగ్వాదం చోటు చేసుకుంది.
పలువురు కార్పొరేటర్లు మేయర్‌తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొన్నది. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్పొరేటర్లను తమ స్థానాల్లో కూర్చోవాలని సభ్యులను కోరినప్పటికీ వారు వినకపోవడంతో సమావేశాన్ని 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.
కలుషిత నీటిపై కౌన్సిల్‌లో బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. తమ డివిజన్‌లో కూడా కలుషిత నీరు వస్తోందని మేయర్ విజయలక్ష్మి చెప్పారు. కౌన్సిల్‌కు జలమండలి ఎండీ హాజరుకాలేదు. దీంతో ఆ ఎండీపై కార్పొరేటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీటింగ్ నుంచే జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో మేయర్ ఫోన్‌లో మాట్లాడారు. జ్వరం కారణంగా తాను కౌన్సిల్ సమావేశానికి.. హాజరుకాలేకపోతున్నట్లు వాటర్ బోర్డ్ ఎండీ వివరణ ఇచ్చుకున్నారు. జలమండలి ఎండీని కౌన్సిల్ మీటింగ్‌కు రావాలని మేయర్ కోరారు. ఈ వ్యవహారంపై కలుగజేసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి.. కార్పొరేటర్లకు సారీ చెప్పారు. దీంతో కార్పొరేటర్లు కాస్త శాంతించారు..
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత