
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌కు చెందిన వీర జవాన్లు రిసల్దార్ ముత్తుముల్ల ఆర్. కృష్ణా రెడ్డి, హవల్దార్ సుభాన్ ఖాన్, సిపాయి నాగరాజులకు ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తరపున గవర్నర్ ఏడీసీ మేజర్ దీపక్ శర్మ గన్నవరం విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు.
లడఖ్ లో మరణించిన తెలుగు జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలుగు జవాన్లు సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీర జవాన్ల కుటుంబాలని ఆదుకుంటామని భరోసా కల్పించారు.
ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతి పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. లద్దాఖ్ ప్రమాదంలో సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎం. ఆర్కే రెడ్డి మృతి చెందటం బాధాకరం అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతిని చేకూరాలని, వారి కుటుబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు.
“లద్దాఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు వీరమరణం పొందడం తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివి” అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
More Stories
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
భారత శ్రామిక శక్తికి కృత్రిమ మేధస్సుతో ముప్పు
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా