ర‌ష్యాలో పెరుగుతున్న మ‌త‌ప‌ర‌మైన విధ్వంసం

ర‌ష్యాలో పెరుగుతున్న మ‌త‌ప‌ర‌మైన విధ్వంసం

కేవ‌లం మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ర‌ష్యా మ‌ళ్లీ భారీ ఉగ్ర‌వాది జ‌రిగింది. మార్చి నెల‌లో మాస్కోలోని ఓ మ్యూజిన్ క‌న్‌సర్ట్ హాల్‌లో జ‌రిగిన కాల్పుల్లో 145 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఆదివారం డాగేస్తాన్ ప్రాంతంలో జ‌రిగిన ఉగ్ర‌వాద కాల్పుల్లో 19 మంది మ‌ర‌ణించారు. దాంట్లో 15 మంది పోలీసు ఆఫీస‌ర్లు ఉన్నారు.

రష్యాలో పెరుగుతున్న మతపరమైన విధ్వంసంపై ఈ దాడులు అద్దం పడుతున్నాయి. ఆ హింస‌పై ర‌ష్యా అధినేత పుతిన్ సహితం ఆందోళ‌న చెందుతున్న‌ట్లు కూడా తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో పుతిన్ కు ఉన్న సంబంధాలు జ‌నాన్ని క‌న్ఫ్యూజ‌న్‌లోకి నెట్టేస్తున్నాయి. సిరియా అధ్య‌క్షుడు బాష‌ర్‌కు పుతిన్ మ‌ద్ద‌తు ఇస్తున్నారు. కానీ ఆ దేశం మాత్రం ఇజ్రాయిల్‌కు శత్రువు. 

మ‌రో వైపు డ్రోన్ల కోసం ఇరాన్‌పై ఆధార‌ప‌డ్డారు. సౌదీ ప్రిన్స్ బిన్ స‌ల్మాన్‌తోనూ పుతిన్‌కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంత‌మైన డాగేస్తాన్‌లో యూదులు, క్రైస్త‌వులు, ముస్లింల‌తో పాటు ఇత‌ర మ‌త‌స్థులు కూడా జీవిస్తున్నారు. అనేక మైనార్టీ తెగ‌లు కూడా అక్క‌డ ఉన్నాయి. 

భిన్న మ‌తా విశ్వాసాలు ఉన్న వారిని ఆద‌రించాల‌ని ఇటీవ‌ల ఓ సారి పుతిన్ పేర్కొన్నారు. కానీ ఆదివారం డాగేస్తాన్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న అక్క‌డ మైనార్టీల్లో ఉన్న బ‌ల‌హీన‌త‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది. సరిహద్దు ప్ర‌దేశాల్లో విభిన్న మ‌తాల‌కు చెందిన వారి ప‌రిస్థితుల‌ను ఎత్తి చూపాయి. వివిధ మ‌త‌స్తుల మ‌ధ్య ఉన్న అంత‌ర్గ‌త పోరాటం మ‌ళ్లీ బ‌య‌ట‌కు పొక్కింది.

ర‌ష్యాలోని కౌకాస‌స్ ప్రాంతంలో డాగేస్తాన్ ఉన్న‌ది. కాస్పియ‌న్ సముద్రం ప‌శ్చిమ తీరంలో ఈ ప్రాంతం ఉన్న‌ది. ర‌ష్యాలో ఉన్న భిన్న‌త్వానికి ఈ ప్రాంతం నిద‌ర్శ‌నం. ఎక్కువ ప‌ర్వ‌త ప్రాంతాలు ఉండే డాగేస్తాన్‌లో మొత్తం 30 ర‌కాల తెగ‌ల ప్ర‌జ‌లు నివ‌సిస్తుంటారు. అక్క‌డ వివిధ ర‌కాల భాష‌లు కూడా మాట్లాడుతుంటారు. 

ఆ రిప‌బ్లిక్ ప్రాంతంలో ఎక్కువ జ‌నాభా ముస్లింల‌దే. భిన్న‌మైన ఇస్లామిక్ మ‌త విధానాలు పాటించే వారు ఎక్కువ‌గా ఉంటారు. ఈ ప్రాంతంలోనే యూద జ‌నాభా కూడా ఉన్న‌ది. డాగేస్థాన్‌లో జుడాయిజం మ‌త ఆన‌వాళ్లు కూడా ఉన్నాయి. ప‌ర్వ‌త శ్రేణుల్లో నివ‌సించే యూద వ‌ర్గీయులు ఇంకా ఆ మ‌త విశ్వాసాల‌ను పాటిస్తుంటారు. ఆ యూదులు ఎక్కువ ప‌ర్షియ‌న్ భాష‌లో మాట్లాడుతుంటారు. 

అయితే చాన్నాళ్ల నుంచి ముస్లింలు, యూదులు క‌లిసి ఉండ‌డంతో ఇక్క‌డ భాష‌లో కొంత తేడా కనిపిస్తుంది. సోవియేట్ యూనియ‌న్ ప‌త‌నం త‌ర్వాత మిత్ర ప్రాంత‌మైన చెచ‌న్యాలో తిరుగుబాటుదారులు పెరిగారు. వేర్పాటువాద ఉద్య‌మం సాగించారు. ఆ స‌మ‌యంలో ఇస్లామిక్ తీవ్ర‌వాదం పెరిగింది. 2000 సంవ‌త్స‌రంలో డాగేస్తాన్‌లో ఇస్లామిక్ తీవ్ర‌వాదుల‌తో ర‌ష్యా ద‌ళాలు పోరాడాయి. 

తాజాగా ఉక్రెయిన్‌తో ర‌ష్యా యుద్ధం చేయ‌డం వ‌ల్ల ఆ దేశంలో ఉన్న మైనార్టీల‌పై ప్ర‌భావం ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా దేశ‌వ్యాప్తంగా సుమారు 200 ర‌కాల మైనార్టీ తెగ‌లు ఉన్నాయి. వేర్వేరు టైం జోన్ల‌లో వాళ్లు జీవిస్తున్నారు.