త్వరలో కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు!

త్వరలో కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు!
గతం ప్రభుత్వం హయాంలో తెలంగాణలో గొర్రెల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అధికారులంతా కేసీఆర్ పేరే చెబుతున్నారని మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయని, దానితో త్వరలో ఆయన ఇంటికి ఈడీ రాక తప్పదని స్పష్టం చేశారు. 
 
గులాబీ పార్టీ మునిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో కలిసిపోతుందని పేర్కొంటూ  గులాబీ పార్టీకి సీఆర్ఎస్(కంపల్‌సరీ రిటైర్మెంట్ స్కీం) అవసరమన్నారుని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు, కేసీఆర్ ఎవరు బీజేపీలోకి వచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. పార్టీ కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ ఆదేశాల ప్రకారమే పని చేస్తున్నట్లు వివరించారు. 
 

కొత్త నేతలు వచ్చినా పదవి రాదనే అపోహ వద్దంటూ అలా అయితే హిమంత బిశ్వశర్మకు అస్సాం ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని చెప్పారు. బీజేపీలో పని చేసిన వారికి తప్పుకుండా గుర్తింపు ఉంటుందని చెబుతూ  కార్పొరేటర్ స్థాయి నుంచి వచ్చిన బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యారని రఘునందన్ రావు గుర్తు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియమాకంపై రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలు తెలపొచ్చని, రాజాసింగ్ తన అభిప్రాయం వెల్లడించారని తెలిపారు. నీట్ పరీక్షపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. తనను గెలిపించిన మెదక్ ను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని, దళితుల భూములు వారికి అప్పగించేందుకు ప్రయత్నిస్తానని  తెలిపారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టు గైడ్ లైన్స్ అన్ని అమలు చేసినట్లు.. ఈ ప్రాజెక్టు టెక్నికల్ గా మాత్రమే రద్దు అయిందని పేర్కొన్నారు. మెదక్ కు ఇందిరమ్మ రాకముందే బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్ వచ్చాయని గుర్తు చేశారు. తనపై పోటీ చేసిన వెంకట్రామిరెడ్డి లక్షల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. అయితే,  ప్రజల బలం ముందు ధన బలం పనిచేయదని చెప్పారు.