కీలక మంత్రిత్వ శాఖలు పాత మంత్రులకే!

కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీయే మంత్రులకు చాలావరకు గత ప్రభుత్వంలోనే శాఖలు కేటాయించారు. ఆదివారం ప్రధాని మోదీతో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, వీరిలో 30 మందికి కాబినెట్ హోదా, 36 మంది సహాయ మంత్రులుగా, 5గురికి స్వతంత్రులుగా ఉన్నారు. వీరికి తాజాగా శాఖలు కేటాయించారు. కీలకమైన శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుంది. 

మళ్లీ కేంద్ర హోంమంత్రి బాధ్యతలు అమిత్ షా చేపట్టగా, రక్షణ శాఖను రాజ్ నాథ్ సింగ్ కు కేటాయించారు. రోడ్డు, రవాణా శాఖను నితిన్ గడ్కరీకి కేటాయించారు. కింజరాపు రామ్మోహన్ నాయుడుకి పౌర విమానాయాన శాఖ కేటాయించారు. గత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల బాధ్యతలు చేపట్టిన జై శంకర్ కు మళ్లీ అవే బాధ్యతలు అప్పగించగా, నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖే కేటాయించారు. 

మరో టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్మూనికేషన్, నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవులు పొందిన కిషన్ రెడ్డికి బొగ్గు గనులశాఖ, బండి సంజయ్ కు హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించారు.

కేబినెట్ మంత్రులు
 
1 రాజ్‌నాథ్ సింగ్: రక్షణ మంత్రిత్వ శాఖ 
2 అమిత్ షా: హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
 3 నితిన్ గడ్కరీ: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ

4 జేపీ నడ్డా: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి; రసాయనాలు, ఎరువుల మంత్రి 5 శివరాజ్ సింగ్ చౌహాన్: వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రి; గ్రామీణాభివృద్ధి మంత్రి. 
6 నిర్మలా సీతారామన్: ఆర్థిక మంత్రి, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి. 
7 ఎస్ జైశంకర్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 
8 మనోహర్ లాల్ ఖట్టర్: హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి; విద్యుత్ మంత్రి 
9 హెచ్‌డి కుమారస్వామి (జేడీఎస్): భారీ పరిశ్రమ, ఉక్కు మంత్రిత్వ శాఖ 
10 పీయూష్ గోయల్: వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

11 ధర్మేంద్ర ప్రధాన్: విద్యా మంత్రిత్వ శాఖ 
12 జితేన్ రామ్ మాంఝీ (హమ్): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
 13 రాజీవ్ రంజన్ సింగ్ (లల్లన్ సింగ్) (జెడియు): పంచాయితీ రాజ్ మంత్రి; మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రి. 
14 సర్బానంద సోనోవాల్: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి 
15 డాక్టర్ వీరేంద్ర కుమార్: సామాజిక న్యాయం, సాధికారత మంత్రి 
16 కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ): పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 
17 ప్రహ్లాద్ జోషి: ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ 
18 జువల్ ఓరం: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 
19 గిరి రాజ్ సింగ్: టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ 
20 అశ్వని వైష్ణవ్: రైల్వే మంత్రి; సమాచార, ప్రసార మంత్రి; ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి.

21 జ్యోతిరాదిత్య సింధియా: కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 
22 భూపేంద్ర యాదవ్: భారత పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 
23 గజేంద్ర సింగ్ షెకావత్: సాంస్కృతిక మంత్రిత్వ శాఖ; పర్యాటక శాఖ మంత్రి 
24 అన్నపూర్ణా దేవి: మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ 
25 కిరణ్ రిజిజు: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి; మైనారిటీ వ్యవహారాల మంత్రి. 26 హర్దీప్ సింగ్ పూరి: పెట్రోలియం, సహజ వాయువు మంత్రి 
27 మన్సుఖ్ మాండవియా: కార్మిక, ఉపాధి మంత్రి; యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి. 
28 జి కిషన్ రెడ్డి: బొగ్గు మంత్రి; గనుల మంత్రి. 
29 చిరాగ్ పాశ్వాన్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి. 
30 సిఆర్ పాటిల్: జలశక్తి మంత్రిత్వ శాఖ
 
సహాయ మంత్రులు (స్వతంత్ర ఛార్జ్)
 
31 రావ్ ఇంద్రజీత్ సింగ్: స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి; ప్రణాళికా మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి; సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి. 
32 డాక్టర్ జితేంద్ర సింగ్: సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ; మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్; ప్రధాన మంత్రి కార్యాలయం; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ; అటామిక్ ఎనర్జీ శాఖ; అంతరిక్ష శాఖ.
33 అర్జున్ రామ్ మేఘవాల్: చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
34 ప్రతాప్ రావ్ జాదవ్ (శివసేన ఏకనాథ్ సిండే): ఆయుష్ మంత్రిత్వ శాఖ; ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. 
35 జయంత్ చౌదరి (ఆర్ ఎల్ డి): నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి.
 
కేంద్ర సహాయ మంత్రులు
 
36 జితేన్ ప్రసాద్: వాణిజ్యం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
37 శ్రీపాద్ నాయక్: విద్యుత్; కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
38 పంకజ్ చౌదరి: ఆర్థిక మంత్రిత్వ శాఖ
39 కృష్ణపాల్ గుర్జార్: సహకార మంత్రిత్వ శాఖ. 
40 రాందాస్ అథవాలే (ఆర్ పి ఐ): సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ. 
41 రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ): వ్యవసాయం, రైతు సంక్షేమం.
42 నిత్యానంద రాయ్: హోం వ్యవహారాలు. 
43 అనుప్రియా పటేల్ (అప్నా దళ్ (ఎస్)): ఆరోగ్య, కుటుంబ సంక్షేమం,  రసాయనాలు, ఎరువులు.
44 వి సోమన్న: జల్ శక్తి; రైల్వేలు. 
45 చంద్రశేఖర్ పెమ్మసాని (టీడీపీ): గ్రామీణాభివృద్ధి; కమ్యూనికేషన్స్.
46 ఎస్పీ సింగ్ బఘేల్: ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ; పంచాయితీ రాజ్
47 శోభా కరంద్లాజే: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు; కార్మిక, ఉపాధి.
48 కీర్తి వర్ధన్ సింగ్: పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు; విదేశీ వ్యవహారాలు.
49 బిఎల్ వర్మ: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ; సామాజిక న్యాయం, సాధికారత.
50 శంతను ఠాకూర్: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు.
51 సురేష్ గోపి: పెట్రోలియం, సహజవాయువు; పర్యాటకం/
52 ఎల్ మురుగన్: సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ; పార్లమెంటరీ వ్యవహారాలు.
53 అజయ్ తమ్తా: రోడ్డు రవాణా, రహదారులు
54 బండి సంజయ్ కుమార్: హోం వ్యవహారాలు. 
55 కమలేష్ పాశ్వాన్: గ్రామీణాభివృద్ధి. 
56 భగీరథ్ చౌదరి: వ్యవసాయం, రైతు సంక్షేమం.
57 సతీష్ దూబే: బొగ్గు, గనులు.
58 సంజయ్ సేథ్: రక్షణ
59 రవ్‌నీత్ సింగ్ బిట్టు: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు; రైల్వేలు.
60 దుర్గా దాస్ : గిరిజన వ్యవహారాలు.
61 రక్షా ఖడ్సే: యువజన వ్యవహారాలు, క్రీడలు.
62 సుకాంత మజుందార్: విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి.
 63 సావిత్రి ఠాకూర్: మహిళా, శిశు అభివృద్ధి
64 తోఖాన్ సాహు: హౌసింగ్, పట్టణ వ్యవహారాలు
65 రాజభూషణ్ చౌదరి: జలశక్తి
66 భూపతి రాజు: భారీ పరిశ్రమలు; ఉక్కు
67 హర్ష్ మల్హోత్రా: కార్పొరేట్ వ్యవహారాలు; రోడ్డు రవాణా, రహదారులు
68 నింబు బెన్ బంభానియా: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ
69 మురళీధర్ మొహౌల్: సహకారం; పౌర విమానయానం
70 జార్జ్ కురియన్: మైనారిటీ వ్యవహారాలు; ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ
71 పబిత్రా మార్గరీటా విదేశీ వ్యవహారాలు; టెక్స్‌టైల్స్.