మణిపూర్ సీఎం కాన్వాయ్​పై ఉగ్రదాడి

మ‌ణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ సెక్యూర్టీ కాన్వాయ్‌పై అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కంగ్‌పోక్‌పి జిల్లాలో ఇవాళ ఉద‌యం ఈ దాడి జ‌రిగింది. ఆ దాడిలో ఒక‌రు గాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఇటీవ‌ల హింస చోటుచేసుకున్న జిరిబ‌మ్ జిల్లాకు కాన్వాయ్ వెళ్తున్న స‌మ‌యంలో దాడి జ‌రిగింది. 
 
సెక్యూర్టీ ద‌ళాల‌పై మిలిటెంట్లు ప‌లుమార్లు కాల్పులు జ‌రిపారు. అయితే ఆ దాడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు తిప్పికొట్టాయి. జాతీయ ర‌హ‌దారి 53పై ఉన్న కొట్లెన్ గ్రామం వ‌ద్ద ప్ర‌స్తుతం ఎదురుకాల్పులు జ‌రుగుతున్నాయి. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కాంగ్​పోక్పి జిల్లాలో జరిగినట్లు వెల్లడించారు.
 
ఎద‌రుకాల్పుల్లో బుల్లెట్ల గాయాల వ‌ల్ల ఒక జ‌వాన గాయ‌ప‌డ్డారు. సీఎం బీరేన్ సింగ్ ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్నారు.  ఆయ‌న ఇంకా ఇంఫాల్‌కు చేరుకోవాల్సిఉన్న‌ది. జిరిబ‌మ్‌కు ఆయ‌న వెళ్ల‌నున్నారు. శ‌నివారం రోజున మిలిటెంట్లు రెండు పోలీసు ఔట్‌పోస్టులు, ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసు, 70 ఇండ్ల‌కు నిప్పు పెట్టారు.  
 
59 ఏళ్ల మైతీ రైతు శరత్‌కుమార్ సింగ్ కొద్ది వారాలుగా కనిపించకుండా పోవడం, ఆయన మృతదేహాన్ని ఆ తర్వాత కనుగొనడంతో జూన్ 6న ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా హింసాకాండ తలెత్తింది. మణిపూర్‌లో కల్లోలిత పరిస్థితుల ప్రభావం పొరుగున ఉన్న అసోంలో కూడా కనిపిస్తోంది. మణిపూర్‌లో జాతుల వైరంతో సుమారు 600 మంది శరణారుర్ధులుగా అసోంకు పారిపోవడంతో పరిస్థితి మరింత విషమిస్తోంది.
 
ఈ నేపథ్యంలో సోమవారం దిల్లీ నుంచి ఇంఫాల్​కు బయలుదేరిన సీఎం బిరేన్ సింగ్, జిరిబామ్​ను సందర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిరిబామ్​కు బయలుదేరిన ముఖ్యమంత్రి ముందస్తు కాన్వాయ్​పై తాజాగా దాడి జరిగింది.