‘‘రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సింగిల్ మైండెడ్ గా, పదునైనదిగా, సూటిగా సాగింది. 2024 ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణను ప్రధాన అంశంగా చేసింది ఆయనే. ఎన్నికల ప్రచారంలో చాలా శక్తివంతంగా ప్రతిధ్వనించిన పాంచ్ న్యాయ్-పచీస్ హామీ కార్యక్రమం రాహుల్ యాత్రల ఫలితమే” అని తెలిపారు.
అయితే, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత పదవిని స్వీకరించడానికి రాహుల్ గాంధీ అంగీకరించారా? అని ప్రశ్నించగా, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. తమ నాయకుడు, కార్యకర్తలను ఉత్సాహపరచడంతో కాంగ్రెస్ పునరుజ్జీవనం ప్రారంభమైందని వేణుగోపాల్ తెలిపారు.
“ప్రజలు అధికార పార్టీ నియంతృత్వ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది గత 10 సంవత్సరాల రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించడం. ఇది విభజన, ద్వేషం, ధ్రువణ రాజకీయాలను తిరస్కరించడం” అని ఖర్గే స్పష్టం చేశారు. “మనం తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి. ఇవి సాంప్రదాయకంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు, ఇక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి, వీటిని మన స్వంత ప్రయోజనాల కోసం కాకుండా మన ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి. ఈ కసరత్తును అతి త్వరలో నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నాను, ” అని మూడు రాస్త్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ చెప్పారు.

More Stories
చెన్నై మెట్రో రెండో దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
“ఏడాది పాటు శాంతికి భంగం కలిగించవద్దు” షరతుపై సిపిజే నేతల విడుదల
మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి