
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. బెంగళూరు రామేశ్వరం కేప్ పేలుడు కేసు నిందితుల గాలింపులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోహెల్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందడం గమనార్హం.
రాయదుర్గం పట్టణంలోని ఆత్మూకూర్ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ గఫూర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. బెంగళూరులో నివాసముంటున్న వారిలో ఒకరైన సోహెల్‌కు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రాయదుర్గంలో మూడు రోజులుగా ఎన్ఐఏ అధికారులు రెక్కీ నిర్వహించారు.
మంగళవారం స్థానిక పోలీసుల సహకారంతో ఎన్ఐఏ అధికారులు గఫూర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సాయుధ దళాల సాయంతో సాహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారించారు. అనంతరం ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య బెంగళూరుకు తరలించారు.
సోహెల్ (సోయేల్)ను అరెస్ట్ చేసినట్లు కుటుంబసభ్యులకు ధృవీకరణ పత్రం అందజేసినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఫోన్ ద్వారా సోహెల్ ఉగ్రవాదులతో మాట్లాడినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. దీనిపై విచారిస్తున్నారు. సోహెల్ ఎస్‌బిఐ ఖాతాలో ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతని కుటుంబ సభ్యులను విచారించారు. అనంతరం అతడిని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. ఉగ్రవాదులతో సంబంధాలపై విచారిస్తున్నారు.
కాగా, గతంలోనూ ఎన్‌ఐఎ అధికారులు ఎపిలోని అనంతపురం పట్టణంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నా యనే ఆరోపణలపై కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాజాగా, రాయదుర్గంలో సోదాలు చేయడంతో ఒక్కసారిగా స్థానికంగా ఆందోళన నెలకొంది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో ఓ వ్యాపారవేత్తను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పుణె కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఇతడ్ని అరెస్ట్ చేశారు. గతంలో పలు నేరాలు శిక్షలు అనుభవించినట్లు ఈ వ్యక్తిని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు