ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ప్రజలు తమ ప్రతినిధిగా డీకే అరుణను ఆశీర్వదిస్తారనే నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో డీకే అరుణ పార్లమెంట్‌లో అడుగుపెడుతారనే నమ్మకం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు ప్రధాని మోదీ మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు లేఖ రాశారు. తాను రాసిన లేఖ అరుణకు మంచి కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక జట్టుగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే తమ ప్రయాణంలో ప్రతి మెట్టును వదిలిపెట్టమని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పరిపాలన మిగిల్చిన అనేక సమస్యల నుంచి దేశానికి విముక్తి కల్పించినట్లు ప్రధాని లేఖలో తెలిపారు. ఇప్పుడు ప్రతి దేశ పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చడంలో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు కూడా నిర్లక్ష్యానికి, అవమానాలకు, అన్యాయానికి గురయ్యాయని ఆరోపించారు.
మోదీ సదరు వర్గాల నుంచి అత్యధికంగా ప్రజాప్రతినిధులు ఎన్నికైన పార్టీ బీజేపీనేనని తెలిపారు. వేసవి తాపం అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. అయితే, లోక్‌సభ ఎన్నికలు మన దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవని, ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ ఉదయం ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయటకు వెళ్లి ఓటు వేయడానికి ప్రజలను ప్రేరేపించడం చాలా ముఖ్యమని సూచించారు. బూత్ గెలుపొందడంపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. ప్రతి బూత్‌లో గెలుపొందడం, నియోజకవర్గంలో విజయానికి దారి తీస్తుందని తెలిపారు. అదే సమయంలో, తమ పార్టీ కార్యకర్తల ఆరోగ్యం, వారి చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అభ్యర్థించారు.

More Stories
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం తడిచి రైతులు విలవిల