ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, ఇతర ఉచితాల పంపిణీపై గట్టి నిఘా ఉంచాలని రాజీవ్‌కుమార్ సూచించారు. ప్రత్యేకించి సాధారణ, పోలీసు, వ్యయ పరిశీలకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని సూచించారు. ప్రత్యేకించి ఏపీలో కొన్ని జిల్లాలు ఎంతో సునిశితమైనవిగా గుర్తించామని, ప్రత్యేక పరిశీలకులు ఆయా జిల్లాల్లో తరచుగా పర్యటించాలని ఆదేశించారు.
ఎండలు, వడగాడ్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీరు, ఓఆర్‌ఎస్, ప్రథమ చికిత్స సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓటు వేయడం సామాజిక బాధ్యత అనే విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని రాజీవ్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఎంఎస్‌లు, సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చైతన్య పరచాలని సూచించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

More Stories
కేరళలోనూ గుజరాత్ తరహాలో త్వరలో అధికార మార్పు
భోజ్‌శాలలో వసంత పంచమి పూజలకు అనుమతి
రెండు పంక్తులతో ప్రసంగం ముగించిన కర్ణాటక గవర్నర్