
అమెరికా మాటలను పెడచెవిన పెట్టి గాజాలోకి చొచ్చుకెళ్తున్న ఇజ్రాయెల్ కు ఓ షాక్ ఎదురైంది. వాషింగ్టన్ నుంచి అందాల్సిన కేలక ఆయుధాల షిప్‌మెంట్‌ను నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కోటి 900 కిలోల బరువు ఉండే 1800 బాంబులు, 226 కిలోల బరువు ఉండే మరో 1700 బాంబులు ఇప్పుడు టెల్‌అవీవ్‌కు అందవు.
ఈ విషయాన్ని బైడెన్ కార్యవర్గం లోని కీలక అధికారి ధ్రువీకరించారు. రఫాలో పౌరుల భద్రత, వారికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళనలు పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రఫాలో దాదాపు 10 లక్షల మందికి పైగా తలదాచుకొంటున్నారు.
ఈ నేపథ్యంలో రఫాలో భారీ ఆపరేషన్లు చేపట్టకూడదని, ఆ ప్రాంతం లోకి మానవీయ సాయం పంపించేందుకు మార్గాలను అన్వేషించడానికి వీలుగా చర్చలు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రఫాలో వాడుతుందని అనుమానిస్తున్న ఆయుధాల ఎగుమతిని పునః సమీక్షిస్తున్నాం అని అమెరికా వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ, కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇది తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు.
More Stories
చైనా – భారత్ సంబంధాలపై మోదీ వ్యాఖ్యలపై చైనా హర్షం
ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
బుధవారం రానున్న వ్యోమగామి సునీతా విలియమ్స్