పన్నూన్‌ హత్య కుట్ర కేసులో భారత్‌కు రష్యా మద్దతు

తమ దేశంలో సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది  గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ ‘రా’ ప్రమేయం ఉందంటూ అగ్రాజ్యం అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మాస్కో తాజాగా స్పందించింది. ఈ మేరకు భారత్‌కు మద్దతిస్తూ అమెరికా ఆరోపణలు తీవ్రంగా ఖండించింది.
 
ఈ కేసులో భారత పౌరుల ప్రమేయంపై వాషింగ్టన్‌ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదని పేర్కొంది. పైగా, భారత్ ను అవమానపరిచే రీతిలో ఈ వాఖ్యలు ఉన్నాయని విమర్శించింది.  ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ మాకు అందిన సమాచారం ప్రకారం  పన్నూన్‌పై హత్య కుట్ర వెనుక భారత్‌ ప్రమేయం గురించి వాషింగ్టన్‌ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకూ అందించలేదు. సాక్ష్యం లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు ఆమోదయోగ్యం కాదు’ అని స్పష్టం చేశారు.

 
ఈ సందర్భంగా అగ్రరాజ్యంపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతదేశ పార్లమెంటరీ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్రపై అమెరికాకు సరైన అవగాహన లేదని ఆమె ధ్వజమెత్తారు. మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆమె విమర్శించారు. 
 
భారత్‌లోని అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యత చేయడానికి, లోక్‌సభ ఎన్నికలను క్లిష్టతరం చేసేందుకు అమెరికా  ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. భారత గూఢచారి విభాగం, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లోని ఒక అధికారి ఖలిస్తానీ వేర్పాటువాదిని హత్య చేసేందుకు “హైర్డ్ హిట్ టీమ్”కు తుది సూచనలను అందజేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది.
 
భారతదేశం. హంతకులు పన్నూన్ ఇంట్లో ఉన్నారని నిర్ధారించిన వెంటనే, “ఇది మా నుండి ముందుకు సాగుతుంది” అని అది జోడించింది. అమెరికా మీడియా కథనాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది.  న్యూ ఢిల్లీ ఈ సమస్యపై దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఈ నివేదికను “తీవ్రమైన విషయంపై అసమంజసమైన, నిరాధారమైన ఆరోపణలు” అని పేర్కొంది. దీనిపై ఊహాగానాలు, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.