తమ దేశంలో సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ ‘రా’ ప్రమేయం ఉందంటూ అగ్రాజ్యం అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మాస్కో తాజాగా స్పందించింది. ఈ మేరకు భారత్‌కు మద్దతిస్తూ అమెరికా ఆరోపణలు తీవ్రంగా ఖండించింది.
ఈ కేసులో భారత పౌరుల ప్రమేయంపై వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదని పేర్కొంది. పైగా, భారత్ ను అవమానపరిచే రీతిలో ఈ వాఖ్యలు ఉన్నాయని విమర్శించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ మాకు అందిన సమాచారం ప్రకారం పన్నూన్‌పై హత్య కుట్ర వెనుక భారత్ ప్రమేయం గురించి వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకూ అందించలేదు. సాక్ష్యం లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు ఆమోదయోగ్యం కాదు’ అని స్పష్టం చేశారు.

More Stories
దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ ఫైటర్ జెట్
నేపాల్‌లో మళ్లీ జెన్ జెడ్ నిరసనలు.. కర్ఫ్యూ!
ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫెల్ పై చైనా అసత్య ప్రచారం