
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాల్లేవంటూ కోర్టు విచారణను ముగించిన నేపథ్యంలో రోహిత్ తల్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.
2016లో జరిగిన ఆత్మహత్యపై తెలంగాణ పోలీసులు గత నెలలో దాఖలు చేసి మూసివేత నివేదికపై న్యాయం చేయాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కేసును పునర్విచారిస్తామని డీజీపీ సైతం ప్రకటించినందున ఈ మేరకు అనుమతివ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నారు.
హైకోర్టు ఈ కేసును ముగించేయడంతో హెచ్సీయూలోని విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా నిలవరించేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య కేసును పునర్విచారణ చేస్తామని డీజీపీ రవిగుప్తా ప్రకటించారు. ఈ కేసు తీర్పు విషయంలో రోహిత్ తల్లి అనుమానం వ్యక్తం చేయడం, విద్యార్థుల నిరసనలు చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు