
కర్నాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపులకే ప్రాధాన్యత ఇస్తుందని, వారికి నేహా లాంటి కూతుళ్ల ప్రాణాలకు విలువ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని మండిపడ్డారు.
బెంగుళూరు కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడును కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోలేదని ప్రధాని ఆరోపించారు. బెలగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఎప్పటిలాగే కాంగ్రెస్ తోపాటు ఇండియా కూటమిపై ప్రధాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. పీఎఫ్‌ఐని ఓట్ల కోసం కాంగ్రెస్ ఉపయోగించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్న దేశ వ్యతిరేక సంస్థ అని, దానిని బీజేపీ ప్రభుత్వం నిషేధించిందని ప్రధాని గుర్తు చేశారు. వాయనాడ్ సీటును గెలుచుకునేందుకు కాంగ్రెస్ ఆ సంస్థను సమర్థిస్తోందని చెబుతూ పీఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థను కాంగ్రెస్ ఒక్క సీటు కోసమే కాపాడుతోందని ప్రధాని దుయ్యబట్టారు.కాంగ్రెస్ యువరాజుకు మన రాజులు, చక్రవర్తుల కృషి గుర్తుండదని ప్రధాని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇంతమంది రాజులు, చక్రవర్తులపై మాట్లాడుతున్నారని, అయితే నవాబులు, చక్రవర్తులు, సుల్తానులపై ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం వారికి లేదని ధ్వజమెత్తారు.
మన వేలాది దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబు చేసిన అకృత్యాలు కాంగ్రెస్‌కు గుర్తుకు రావని, ఔరంగజేబును పొగిడే పార్టీలతో కాంగ్రెస్ రాజకీయ పొత్తులు పెట్టుకుందని ప్రధాని మండిపడ్డారు. మన తీర్థయాత్రలను ధ్వంసం చేసిన, వాటిని దోచుకున్న, మన ప్రజలను చంపిన, ఆవులను చంపిన వారందరి గురించి వారు మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు