సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీటీడీ ఐటీశాఖకు చెందిన మురళీ సందీప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల ఒకటో పట్టణ పోలీసులు రమణదీక్షితులపై ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేసి విచారణ నిమిత్తం హాజరుకావాలని కోరారు.
తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమణదీక్షితులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శీతిరాజు శ్యాంసుందర్‌రావు వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవని చెబుతూ ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పిటిషనర్‌కు 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు.
ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, 41ఏ నోటీసు నిబంధనను పాటించాలని పోలీసులను ఆదేశించారు. ఒకవేళ పోలీసులు ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేస్తే దానిని సవాలు చేసుకునే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇచ్చారు. అనంతరం పిటిషన్‌పై విచారణను మూసివేశారు.

More Stories
నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్!
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
పండుగ తరహాలో తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు