ఇకపై ఐరోపా దేశాలకు వెళ్లే భారతీయులకు యూరోపియన్ యూనియన్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఈయూ నూతన వీసా విధానాన్ని ప్రకటించింది. షార్ట్ స్టే వీసా అయిన షెంగెన్ వీసాతో ఐరోపా దేశాలకు వెళ్లే భారతీయులు ఇదివరకు ఆ వీసా కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేయాల్సి వచ్చేది. నూతన విధానం ప్రకారం ఇకపై ఆ అవసరం ఉండదు.
షార్ట్ స్టే షెంగెన్ వీసాకు బదులుగా ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యేలా మల్టిపుల్ ఎంట్రీ షెంగెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈయూ భారతీయులకు కల్పించింది. ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీని బట్టి వీసాలపై వ్యాలిడిటీ ఉంటుంది. ఐరోపా సమాఖ్య ఏప్రిల్ 18న భారతీయ పౌరులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాల జారీపై నిర్దిష్ట నిబంధనలను ఆమోదించింది. ఇది ప్రస్తుత వీసా ప్రామాణిక నిబంధనల కంటే చాలా సులభతరంగా ఉంటుంది.
కొత్తగా వచ్చిన వీసా ‘క్యాస్కేడ్’ విధానం ప్రకారం.. భారతీయ పౌరులకు ఇప్పుడు దీర్ఘకాలిక, బహుళ-ప్రవేశాల కోసం షెంగెన్ వీసాలను జారీ చేయనున్నారు. ఇందుకు అర్హత సాధించాలంటే గత మూడేళ్లలో కచ్చితంగా రెండుసార్లు వీసా ఆమోదం పొంది ఉండాలి. చట్టబద్ధంగా ఆ వీసాను వాడుకుంటే తర్వాత రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

More Stories
ప్రపంచ అభివృద్ధి ప్రమాణికాలపై పునరాలోచన
జి20 సదస్సుకు అమెరికా, రష్యా, చైనా అధినేతలు దూరం!
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో అరెస్ట్