నేడు ప్రపంచం మొత్తం ఆదరిస్తున్న డాక్టర్జీ ఆలోచనలు

రాంపల్లి మల్లిఖార్జునరావు                                                                                                                                                        దార్శనికులు  డాక్టర్ హెడ్గేవార్ -2

ముస్లిముల దండయాత్రలతో ఈ దేశంలో ఇస్లాం ప్రవేశించింది.  ఒక ప్రక్క ఈ దేశ రాజ్యాధికారాన్నిచే చిక్కించుకుంటూనే మరో ప్రక్క పెద్ద ఎత్తున మతమార్పిడులు చేస్తూ దేశాన్నిఇస్లామీకరణ చెయ్యటం  ప్రారంభించింది. బ్రిటిష్ వారి ప్రవేశంతో ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.  1920లో ప్రారంభమైన కమ్యూనిజం నుండి  నక్సలిజం పుట్టుకొచ్చింది.

మరోప్రక్క  బ్రిటిష్ వారు సృష్టించిన ఆర్య ద్రావిడ సిద్ధాంతం,  భారత్ ఒక ఉపఖండము అనే సిద్ధాంతాల ప్రభావాలకు లోనైనా ఉదారవాద మేధావి వర్గం క్రొత్తగా పుట్టుకొచ్చి దేశ సమగ్రతకు సవాళ్లు విసురుతున్నారు.  ఈ సవాళ్ళను అధిగమించేందుకు దూరదృష్టితో   డాక్టర్జీ  ఇది హిందూ రాష్ట్రమని  ఆ రోజులలోనే నిర్ద్వందంగా ప్రకటించి,  హిందూ సమాజ సంఘటనకు తెరలేపారు.

ఈ పనిలో డాక్టర్జీ   అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. సంఘ స్వయంసేవకలలో  అనుశాసనం,  దేశభక్తి సమాజంలోని అందరినీ ఆకట్టుకుంటోంది.  ఇది కాంగ్రెస్ నాయకులకు నచ్చకపోయేది. మరో ప్రక్క హిందూ మహాసభ వారిలో ఈ స్వయం సేవకులు తమకు అన్ని రకాలుగా ఉపయోగపడటం లేదనే అసంతృప్తి ఉండేది.

కాంగ్రెస్ వారి అసహనం హిం,దూ మహాసభ వారి అసంతృప్తి -ఈ రెండింటి మధ్య డాక్టర్జీ   సంఘాన్ని నిలబెట్టడంలో సఫలీకృతమయ్యారు.  కాంగ్రెసు వారు, స్వాతంత్రానంతరం పుట్టు కొచ్చిన రాజకీయ సంస్థలు అన్నీ కూడా రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని తమ ప్రత్యర్థిగానే భావిస్తూ వచ్చాయి. సంఘ్ ఒక సామాజిక జాతీయ సంస్థగా దేశహితం కోసం పనిచేస్తున్నదని భావించలేదు.   సంఘ ప్రగతిని జీర్ణించుకోలేకపోయారు.

రాజకీయాలు విసిరే సవాళ్లకు  పరిష్కార ము  హిందూ సమాజ సంఘటనలోనే ఉన్నదనే  డాక్టర్జీ   విశ్లేషణ అక్షర సత్యము. డాక్టర్జీ   హిందూ సమాజ సంఘటనకు రెండు విశేషాలు జోడించారు.   1. సంఘ కార్యం ఈశ్వరీయ కార్యం 2. సంఘ కార్యం రాష్ట్రీయ కార్యము.  ఈ రెండు మాటలతో సమాజ సంఘటన గురించి  డాక్టర్జీ   కల్పన మనకు అర్థమవుతుంది.

సంఘ కార్యం ద్వారా సమాజ హితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుండి దేశమంతటా తయారుకావాలి అనేది వారి లక్ష్యం. తద్వారా దేశమంతటా దేశ హితం గురించి ఆలోచించే వ్యవస్థ నిర్మాణంకావాలి.  అదే ఈ దేశానికి శ్రీరామరక్ష. ఈ రోజున దేశమంతటా వారి ఆలోచనలసాకారం  కనబడుతోంది.  మనందరం ఒకే జాతి అనే భావం  నిర్మాణం మనకు కనబడుతోంది.

అటువంటి ఆలోచనలు మనకు కలిగించిన   డాక్టర్జీ    ఒక యుగ ద్రష్ట.  ఈరోజు దేశమంతటా మనం ఒకటే అనే భావంకు తాజా ఉదాహరణ అయోధ్యలో రామజన్మభూమిలో రామమందిర నిర్మాణానికి ప్రజల నుండి వచ్చిన స్పందనను చూస్తే అర్థమవుతుంది. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం వేగంగా పెరుగుతున్నది. దానిని  మరింత వేగంగా ముందుకు  తీసుకుని వెళ్లేందుకు  ప్రయత్నం చేద్దాం

ఈ వితర్కాల  కుట్రలు ఎలా చోటు చేసుకొన్నాయి?  

అసలు ఇటువంటి ప్రశ్నలు మన సమాజంలో ఎందుకు తలెత్తే తున్నాయి? అనేది తెలుసుకోవాలంటే మనం చరిత్రను ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది.  బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన  రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్  తర్వాత బ్రిటిష్ ప్రధాని వాగ్దోనాల్డ్ ఒక ప్రకటన చేశారు. ”అన్ని వర్గాలకు తృప్తినిచ్చే ఏదైనా ఒక ప్రణాళికను మీరు సూచించకపోతే ప్రభుత్వమే ఆ పని చేయవలసి వస్తుంది.  ప్రజాస్వామ్యం పేరిట అధిక సంఖ్యాకులు పశుబలంతో అల్పసంఖ్యాకులను అణచకుండా అవసరమైన అంకుశాలను సృష్టించవలసి వస్తుంది” అని ప్రకటించాడు.

1932 ఆగస్టు 17న బ్రిటిష్ ప్రధాని తాను అనుకున్నట్లు కమ్యూనల్ అవార్డును ప్రకటిం చాడు.  అవార్డు ప్రకారం ఈ దేశ ప్రజలను 1. హిందువులు, 2. ముస్లింలు,  3. సిక్కులు, 4. దళితులు, 5. భారతీయ క్రైస్తవులు, 6. యూరోపియన్ లు అంటూ విభజించి వారికి రిజర్వేషన్లు ప్రత్యేకించి కేటాయించారు.  ఇది దేశ విభజనకు సంకేతంగా మారిపోయింది.

నిని కాంగ్రెస్ గాని, నెహ్రుగాని   ప్రతిఘటించలేదు. దాని భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉంటాయి ?అని కూడా ఆలోచించలేదు. కానీ డాక్టర్జీ   ఈ అవార్డు చూసిన తర్వాత దానిని తీవ్రంగా వ్యతిరేకించార.  ఈ అవార్డు రానున్న ఆపదలకు గుర్తుగా వారు గుర్తించారు. దాని పరిణామం ఆ తదుపరి కాలంలో దేశవిభజనలో  మనం చూశాం.

రాజకీయాలకు అలిప్తంగా డాక్టర్జీ  

డాక్టర్జీ   కాంగ్రెస్ లో, హిందూ మహాసభలో పని చేస్తు చేస్తూ, వాటినుండి బయటకు వచ్చి సంఘాన్ని ప్రారంభించారు. అట్లా అని  డాక్టర్జీ   రాజకీయాలను ఉపేక్షించ లేదు. అట్లాగే రాజకీయాలే సర్వస్వం  అని కూడా అనలేదు. రాజకీయాలకంటే సామాజికశక్తి అవసరం గుర్తించారు. అవసమైతే రాజకీయాలను నియంత్రించ గలిగే సామాజిక శక్తిఉండాలని భావించారు. అందుకే సంఘాన్ని ప్రారంభించారు.

స్వాతంత్ర పోరాటానికి ఒక వేదికగా ప్రారంభమైన కాంగ్రెస్ క్రమంగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతూ వచ్చింది. రాజకీయాలతోనే అన్ని సాధించవచ్చు, అవే సర్వస్వం అని భావిస్తూ కాంగ్రెస్ నెహ్రు వ్యవహరించినటువంటి తీరు దేశానికి చాలా నష్టం కలిగించింది.

డాక్టర్జీ   ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి రాజకీయాలకు  అలిప్తంగా  రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్నిప్రారంభించారు. హిందూ సమాజంలో   ఒక సామాజిక శక్తి, ధార్మిక శక్తిని  నిర్మాణం చేయటానికి కృషి చేశారు. దేశ ఉజ్వల భవిష్య్తతుకు ఈర్షలతో  నిండి ఉండే రాజకీయాలు ఉపయుక్తం కావని, ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకొని పక్షంలో అవి దేశానికి హానికరం కూడా కావచ్చు అని డాక్టర్జీ   హెచ్చరిస్తూ ఉండేవారు.

అర్ధా తురాణాం   నా గురు నబంధు: కేవలం ధనాకాంక్ష కలవాడు గురువుని బంధువులను కూడా  లెక్కచేయడు

కామాతురాణాం నా భయం న లజ్జ కామాతురుడైన  వాడికి భయము లజ్జ ఉండవు.

అట్లాగే ఈ రోజున సత్తా తురాణాం  న  దళం, న  రాష్ట్రం.  పదవీకాంక్ష గల రాజకీయ నాయకుడుకి పార్టీ లెక్క ఉండదు. దేశం కూడా లెక్కలో ఉండదు.

తాను అధికారం సాధించడమే అతని లక్ష్యంగా ఉంటుంది. ఇటువంటి రాజకీయాల విషయంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. అందుకే   రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కొరకు అనుశాసనం,  సంఘటితమైన సామర్థ్యాన్నిసమాజంలో  నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను  ప్రారంభించారు.  ఈ రోజు ఆ డాక్టర్జీ ఆలోచనలే  సరియైన వని  నిరూపించి బడుతోంది. అది డాక్టర్జీ దూరదృష్టి.

శత జయంతికి సిద్ధమౌతున్న సంఘం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించి 2024 సంవత్సరం విజయదశమి పండుగకు 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నది. ఈ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది.

అందులో 1. సామాజికసమరసత,  2. కుటుంబ  ప్రబోధన్, 3. పర్యావరణం, 4. స్వదేశీ భావన, 5. పౌర విధులు. ఈ  పనుల ద్వారా సంఘం రాబోవు కొద్ది సంవత్సరాలలోనే సమాజంలో శక్తి వంతమైన  సామజిక వ్యవస్థ నిర్మాణం చేయాలని సంకల్పించింది. 99 సంవత్సరాలకు పూర్వం డాక్టర్జీ  సమాజం ముందు ఉంచిన సిద్ధాంతం ఈ రోజు దేశం,  ప్రపంచం అంతా అంగీకరిస్తున్నది. అనుసరించటానికి సిద్దపడుతున్నది. అది సిద్ధాంత విజయం

 (ముగింపు)