
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్-2024ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్ న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది.
రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉండగా, సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 887 ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభ , అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయని వెల్లడించింది.
పోలింగ్ కు సరిగ్గా 57 రోజుల సమయం ఉంది. గత ఎన్నికల కంటే ఈ సారి దాదాపు నెల రోజులు ఆలస్యంగా పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లకు గడువు నిర్ణయించారు. మే 13న పోలింగ్ జరగనుంది. మే 11న ప్రచారం ముగియనుంది. అంటే ఖచ్చితంగా 55 రోజుల సమయం ఉంది. సుమారు రెండు నెలల వ్యవధి ఉండడంతో అభ్యర్దులు ప్రచారం ఖర్చు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు