
మిచెల్ ఒబామా ఇటీవల బికమింగ్ అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని రాశారు. ఇప్పుడు అది మార్కెట్‌లో బెస్ట్‌సెల్లర్. 1025 మందికి నిర్వహించిన సర్వేలో ఆమెకు 15 శాతం ఓట్లు పడ్డాయి. మాజీ ఫస్ట్ లేడీగా ఉన్న సమయంలో మిచెల్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అమెరికన్ పిల్లల్లో ఒబెసిటీ తగ్గించేందుకు కూడా ఆమె పోరాటం చేశారు.
మహిళల హక్కుల కోసం కూడా ఆమె తీవ్రంగా శ్రమించారు. వైట్‌హౌజ్‌తో పాటు బయట కూడా ఆమె అనేక కేసుల్ని లీడ్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో యూగోవ్ నిర్వహించిన పోల్‌లో మిచెల్ ఒబామా ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ అడ్మైర్డ్ వుమెన్‌గా నిలిచారు. ఆ పోల్‌లో ఏంజలినా జోలీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు.
గ్యాలప్ పోల్‌లో హిల్లరీ క్లింటన్ మూడవ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఒఫ్రా విన్‌ఫ్రే ఉన్నారు. ఆ జాబితాలో చోటు సంపాదించిన వారిలో మెలానియా ట్రంప్, క్వీన్ ఎలిజబెత్, ఏంజెలా మెర్కల్ ఉన్నారు.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్