
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. అప్పుడప్పుడు వివాదాలకు కేంద్రంగా ఉండే హెచ్సీఏలో మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఏకంగా మహిళల జట్టు హెడ్ కోచ్ జైసింహపై ఫిర్యాదులు అందాయి. అసభ్యంగా ప్రవర్తించారంటూ హెచ్సీఏ అధ్యక్షుడికి మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలోనే కోచ్ జైసింహను సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు జగన్ మోహన్రావు ఆదేశాలు జారీ చేశారు. జైసింహా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు క్రికెట్ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్రావు.
ఉమెన్స్ టీమ్ ప్రయాణిస్తున్న బస్సులో మద్యం సేవించి క్రికెటర్లను వేధింపులకు గురి చేసిన అతడిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది.
కావాలనే విమానం మిస్ చేసి, బస్సులో ప్రయాణించేలా చేసి కూల్ డ్రింక్ బాటిల్లో మద్యం నింపుకుని బస్సులో తాగుతూ మహిళా క్రికెటర్లను వేధింపులకు గురిచేసిన వీడియో ఒకటి బయటకు లీకయింది.
ఈ దృశ్యాలు వాట్సాప్ గ్రూపులు, టీవీ చానెళ్లలో వైరల్ అయ్యాయి. దాంతో, అతడిపై తక్షణమే వేటు వేస్తున్నట్టు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఓ ప్రకటించారు. ‘జై సింహ మద్యం సేవించిన ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం. అనంతరం అతడిపై చర్యలు తీసుకుంటాం. మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించేది లేదు. విచారణ ముగిసేంతవరకు జై సింహను సస్పెండ్ చేస్తున్నాం’ అని వెల్లడించారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!