భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక స్వామి వివేకానంద. సుభాష్ చంద్ర బోస్ మొదలైన స్వాతంత్రోద్యమ నాయకులలో స్ఫూర్తినింపిన వివేకానంద ఆలోచన ధోరణి ఎంతటి శక్తివంతమో నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆర్యజనని, రామకృష్ణ మఠం సంయుక్తంగా జాతీయస్థాయి క్విజ్ పోటీ నిర్వహిస్తున్నాయి.
వివేకానందులు బోధించిన కర్మ యోగ సిద్ధాంతం ఆధారంగా ‘ది సీక్రెట్ ఆఫ్ వర్క్’ అనే పేరుతో క్విజ్ కార్యక్రమాన్ని ఆన్ లైన్ ఓపెన్ బుక్ పద్ధతిలో చేపట్టారు. 18 నుంచి 30 ఏళ్ల యువతీయువకులు ఈ పోటీకి అర్హులు. విజేతలకు రూ.30 లక్షలకు పైగా స్కాలర్షిప్స్ అందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
120 పేజీలున్న కర్మయోగ పుస్తకాన్ని ఆకలింపు చేసుకుంటే సులభంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఇందులో మొదటి రౌండ్ ఈ నెల 25న నిర్వహించనున్నారు. అయితే రిజిస్ట్రేషన్లకు ఈ నెల 15 వరకు చివరి తేదీ.
టాప్ 200 లో ఉన్న వారిని వర్చువల్ విధానంలో జరిగే ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేస్తారు! మీ రిజిస్ట్రేషన్స్‌ను www.ajcontest.org ద్వారా చేసుకోండి.

More Stories
ప్రజలపై కాంగ్రెస్ అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!