ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి అధినేత, విపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఎసిబి కోర్టులో భారీ ఊరట లభించింది. పై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు.. ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ వేసిన ఛార్జిషీట్‌ను విజయవాడ ఎసీబీ కోర్టు తిరస్కరించింది.
చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు తాజాగా దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది. దీనిపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు.. సెక్షన్ 19ఏ ప్రకారం గవర్నర్ అనుమతి లేనిదే సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు వీల్లేదని తేల్చిసింది. ఈ మేరకు సీఐడీ ఛార్జిషీట్ ను తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుతో పాటు నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణలకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఎన్నికల వేళ ఊరట లభించినట్లయింది.
More Stories
నవంబర్ 11 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
రిషికొండ ప్యాలెస్ కట్టిన వ్యక్తికి ప్రజాకోర్టులో శిక్ష పడాల్సిందే
మాజీ వైసిపి మంత్రి నాగార్జునపై అత్యాచారం కేసు