ఆప్ నేత సంజయ్ సింగ్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ నిరాకరించారు. సంజయ్ సింగ్ వ్యవహారం ప్రివిలేజెస్ కమిటీ దర్యాప్తులో ఉందని ధన్కర్ తెలిపారు. సంజయ్ సింగ్‌పై ప్రత్యేక హక్కుల ఉల్లంఘటన కేసును రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ విచారిస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సంజయ్ సింగ్‌ను రాజ్యసభ ఎంపీగా ఆప్ మరోసారి నామినేట్ చేసింది. సంజయ్ సింగ్‌తోపాటు ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్, చార్టర్డ్ అకౌంటెంట్ నరైన్ దాస్ గుప్తాను రాజ్యసభకు నామినేట్ చేశారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు , ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఏడు రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరుతూ సంజయ్ సింగ్ ఫిబ్రవరి 1న ఢిల్లీ లోని రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అయితే పార్లమెంట్‌కు ప్రమాణం చేయడానికి మాత్రమే కోర్టు అనుమతిచ్చింది.
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌ను గత ఏడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. డిసెంబర్ 22, 2023న బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది.
ఆ తర్వాత జనవరి 3న ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. బయటకు వస్తే కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది.

More Stories
భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి
షాహీన్‌కు పుల్వామా దాడి సూత్రధారి భార్యతో సంబంధాలు!
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు