భూ కుంభకోణం కేసులో గత పది రోజుల్లో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఈనెల 20న హేమంత్ సోరెన్‌ను 7 గంటలకు పైగా అధికారులు ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా మరోసారి విచారణ జరిపేందుకు భారీ భద్రత మధ్య రాంచీలోని సోరెన్ అధికార నివాసానికి ఈడీ అధికారులు బుధవారం చేరుకున్నారు.
దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎంను అరెస్టు చేసే అవకాశాలున్నాయని, ఆమె సతీమణి కల్పానా సోరెన్‌కు హేమంత్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలోనే జేఎంఎం ఎమ్మెల్యేలు సీఎం నివాసం వద్ద బలప్రదర్శనకు దిగారు.
కేంద్రం ఆదేశాల మేరకే తమ సీఎంను ఈడీ వేధిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక దిగ్బంధాలకు దిగుతామని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ఈడీ విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో సోరెన్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

More Stories
షట్‌డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు