ఏపీ రాజకీయాలకు మతం రంగు

తనకు ఏకు మేకై కూర్చున్న సోదరి విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దానికి మేథోమధనం చేస్తున్న జగన్.. ఏపీ రాజకీయాలకు విరివిగా మతం రంగును పూసేస్తున్నారు. సిద్ధం పేరుతో తాను నిర్వహించే ప్రతీ బహిరంగ సభలోనే వేదికను అనుసంధానిస్తూ.. ఓ “శిలువ” మార్గాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆయన తన పార్టీ శ్రేణులకు నిర్ధేశించారు. సిద్ధం పేరుతో గత శనివారం నిర్వహించిన బహిరంగ సభలో క్రైస్తవ శిలువ ఆకృతిని ఏర్పాటు చేశారు.
వేదిక నుంచి పార్టీ కార్యకర్తలు కూర్చునే చోటుతో అనుసంధానం చేసి శిలువ ఆకారాన్ని ఏర్పాటు చేశారు. దానిపై సీఎం జగన్ నడిచి.. సభకు తరలివచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. దీంతో తాను క్రైస్తవుల విషయంలో ఎప్పట్లాగే ఉన్నాననే సంకేతాన్ని పంపించినట్లైంది. తాను క్రైస్తవ విశ్వాసి అని ప్రకటించడం కోసం జగన్ ఇలా చేయడం ఇదే ప్రథమం.
అయితే ఇది ఈ ఒక్క సభకే పరిమితం కాదని.. ఇక నుంచి నిర్వహించే ప్రతీ ఎన్నికల సభలో.. ఈ క్రాస్ గుర్తును ప్రదర్శిస్తారని తెలుస్తోంది. జగన్ ఇంతటితోనే ఆగలేదు. క్రైస్తవ సువార్తికురాలు అయిన తన సొంత మేనత్తతో కూడా ప్రభువుపై ఉన్న తన విశ్వాసాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు జిల్లాల్లో  విరివిగా “సేవకుల సదస్సు” పేరిట రాజకీయ సువార్త సభలను ఏర్పాటు చేయిస్తున్నారు.
ఈ సదస్సులకు జిల్లాల నుంచి భారీ ఎత్తున పాస్టర్లను, చర్చ్‌ నిర్వాహకులను తరలిస్తున్నారు. అందులో జగన్ మంచి ప్రార్థనా పరుడు అని.. ఏసుప్రభువుపై విశ్వాసం సడలనివాడంటూ చెప్పుకొస్తున్నారు. క్రైస్తవులంతా మరోసారి జగన్ కే ఓటు వేయాలంటూ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. జగన్. పేరుకు ఎన్నికల ప్రచార సభే అయినా.. మత ప్రాతిపదికన ఓట్లు రాబట్టడమే “సిద్ధం” సభల లక్ష్యంగా కనిపిస్తుంది.
ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు ఎంతో కొంత దాన్ని రాబట్టే లక్ష్యంతో ఆ పార్టీ షర్మిలను రంగంలోకి దింపింది. కనీసం 5 శాతం ఓటింగ్ ను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో.. వచ్చీ రాగానే క్రిస్టియన్ ఓటుపైనే అస్త్రాన్ని సంధించింది. ఇటు షర్మిల కాంగ్రెస్ అస్త్రం.. అటు భర్త అనిల్ కుమార్ మత ప్రచారంతో.. ఎంతో కొంత ప్రభావం చూపించేందుకు సిద్ధమవుతున్నారు.