
వన్యప్రాణుల సంరక్షణపై మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా పులులు, ఇతర క్రూర మృగాల ఉనికిని తెలుసుకుని సంబంధిత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు తొలుత ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి, కార్యాచరణ రూపొందించాలన్న అభిప్రాయానికి వచ్చారు.
తడోబా, కవ్వాల్ టైగర్ రిజర్వుల పరిధిలో పులుల కదలికలను పర్యవేక్షించేందుకు ఆధునిక సాంకేతికతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జాతీయ గణాంకాల ప్రకారం 2022 నాటికి దేశంలో 3,167 పులులు ఉన్నాయి. వీటిలో 204 పులులు నిరుడు జనవరి 1 నుంచి డిసెంబర్ 25 మధ్య కాలంలో మృతి చెందినట్టు వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా (డబ్ల్యుపీఎస్‌ఐ) వెల్లడించింది.
మహారాష్ట్రలో 52, మధ్యప్రదేశ్‌లో 45 , ఉత్తరాఖండ్‌లో 26, తమిళనాడులో 15, కేరళలో 15, కర్ణాటకలో 13, అస్సాంలో 10, రాజస్థాన్‌లో 10, ఉత్తరప్రదేశ్‌లో 7, బీహార్‌లో 3, ఛత్తీస్‌గఢ్‌లో 3, ఒడిశాలో 2, ఏపీలో 2, తెలంగాణలో ఒకటి చనిపోయినట్టు వివరించింది. వీటిలో 79 పులులు వేటగాళ్లు వల్ల, 46 పులులు అంతర్గత ఘర్షణల వల్ల, 7 పులులు ప్రమాదాల వల్ల, 2 పులులు ఇతర జంతువుల దాడుల వల్ల, ఒక పులి స్థానికుల దాడిలో మృతిచెందినట్టు వివరించింది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి