ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ -2023గా విరాట్ కోహ్లీ !

ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ -2023గా విరాట్ కోహ్లీ !

టీమిండియా మాజీ సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ (ఐసీసీ) 2023 పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లి ఈ ఘనత సాధించడం ఇది (2012, 2017, 2018, 2023) నాలుగోసారి. 2023లో కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికులను, తన అభిమానులను ఆకట్టుకున్నాడు. 

అంతే కాకుండా అత్యధిక వన్డే సెంచరీలు (49) చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక గతేడాది ఆస్ట్రేలియాను ఆరోసారి వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ప్రతిష్టాత్మక సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు అందుకోనున్నాడు.

2023లో తనకెంతో ఇష్టమైన వన్డే ఫార్మాట్లో టాప్ ఫామ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇలా నాలుగుసార్లు ఈ అవార్డు అందుకున్న తొలి ప్లేయర్ గా కోహ్లి రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఏబీ డివిలియర్స్ మూడుసార్లు అందుకోగా, కోహ్లి అతన్ని వెనక్కి నెట్టాడు.

గతేడాది జరిగిన వరల్డ్ కప్ లో టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లి 11 మ్యాచ్ లలో ఏకంగా 765 రన్స్ చేశాడు. 9 మ్యాచ్ లలో కనీసం 50, అంతకంటే ఎక్కువ స్కోర్లు చేశాడు. మొత్తంగా ఓ వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా కోహ్లియే గెలుచుకున్నాడు. ఫైనల్లో అతడు ఫైటింగ్ హాఫ్ సెంచరీ చేసినా ఇండియా ట్రోఫీ గెలవలేకపోయింది.

మొత్తం 2023లో అన్ని ఫార్మాట్లు కలిపి కోహ్లి ఏకంగా 2048 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లు కలిపి 8 సెంచరీలు చేయడం విశేషం. గతేడాది వన్డేల్లో 50వ సెంచరీతో అతడు సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.

సూర్యకు వరుసగా రెండోసారి

కాగా, టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఇండియాకు చెందిన సూర్యకుమారి యాదవ్ వరుసగా రెండోసారి గెలుచుకున్నాడు. 2022లోనూ సూర్యనే ఈ అవార్డు వరించింది. 2023లో సూర్యకుమార్ 17 టీ20 ఇన్నింగ్స్ లో 48.86 సగటుతో 733 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 155.95 కావడం విశేషం. అందులో శ్రీలంకపై 51 బంతుల్లోనే చేసిన 112 రన్స్ ఇన్నింగ్స్ కూడా ఉంది.

ఇక గతేడాది ఆస్ట్రేలియాను ఆరోసారి వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రతిష్టాత్మక సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోనున్నాడు. ఓ బౌలర్ గా, కెప్టెన్ గా 2023లో ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తోపాటు వరల్డ్ కప్ కూడా అందించాడు. అంతేకాదు యాషెస్ సిరీస్ 2-2తో డ్రా కావడంలోనూ కీలకపాత్ర పోషించాడు. సిరీస్ డ్రా కావడంతో యాషెస్ ట్రోఫీ ఆస్ట్రేలియా దగ్గరే ఉంది.

ఇలా గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్ కు ఓ మరుపురాని ఏడాదిగా మార్చేశాడు కమిన్స్. మరో ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. అతడు 2023లో 13 టెస్టుల్లో ఏకంగా 1210 రన్స్ చేసి ఈ అవార్డును ఎగరేసుకుపోయాడు. ఇక ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర గెలుచుకున్నాడు. అతడు కూడా గతేడాది వరల్డ్ కప్ లో మూడు సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.

ఐసీసీ అవార్డులు 2023 – పూర్తి విజేతల జాబితా..
* ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – ప్యాట్ కమిన్స్
* ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – ఉస్మాన్ ఖవాజా
* ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – విరాట్ కోహ్లి
* ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – సూర్యకుమార్ యాదవ్
* ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – రచిన్ రవీంద్ర
* ఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – బాస్ డి లీడే

సీసీ ఉమెన్ అవార్డులు 2023
* ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – నాట్ సివర్
* ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – చమరి ఆటపట్టు
* ఐసీసీ ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – హేలీ మాథ్యూస్
* ఐసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – ఫోబే లిచ్‌ఫీల్డ్
* ఐసీసీ ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – క్వింటర్ అబెల్