సెంచరీని శ్రీరాముడికి అంకితం చేసిన భారత క్రికెటర్

సెంచరీని శ్రీరాముడికి అంకితం చేసిన భారత క్రికెటర్

అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో మరికొన్ని గంటల్లో బాలరాముడు కొలువు దీరనున్నాడు. కాగా జనవరి 16న విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలై ఒంటి గంటకు పూర్తవుతుంది. నగర శైలిలో నిర్మిస్తోన్న రామమందిరం 2.7 ఎకరాల్లో విస్తరించి ఉంది. 380 అడగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తంగా 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి.

ఇక అయోధ్యలో ప్రతిష్టాత్మక రామమందిర ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశం మొత్తం రామనామస్మరణతో మార్మోగిపోతోంది. ఈ సందర్భంగా భారత వికెట్ కీపర్ కేఎస్ భరత్ తన సెంచరీని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు ముందు భారత్ ఏ జట్టు అనధికార టెస్టు ఆడింది. ఈ మ్యాచ్ లో కేఎస్ భరత్ 165 బంతుల్లో 116 నాటౌట్ సెంచరీతో మెరిసి తన ఫామ్ చాటుకున్నాడు. కాగా సెంచరీని కేఎస్ భరత్ శ్రీరాముడికి అంకితమిస్తూ రాముడు విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సందించిన విధానాన్ని అనుకరిస్తు బ్యాట్ ను పైకి లేపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.