
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేరళలో పర్యటించిన సందర్భంగా ఈ నెల 17న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీతోపాటు ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది కూడా ఆ ఆలయం సంప్రదాయాలను పాటించారు. గురువాయూర్ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు విధిగా ధోతి, శాలువా ధరించాలి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆ ఆచారాన్ని పాటించారు. ధోతి ధరించడంతోపాటు తెల్లని శాలువా కప్పుకున్నారు. కాగా, ప్రధాని మోదీ భద్రత కోసం వెంట ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమాండోలు కూడా ఈ సందర్భంగా గురువాయూర్ ఆలయం ఆచారాన్ని పాటించారు. వారు కూడా ధోతీలు ధరించడంతోపాటు తెల్లని శాలువాలు కప్పుకున్నారు.
ప్రధాని మోదీకి భద్రతగా ఉండి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. మరోవైపు ఎప్పుడూ నలుపు లేదా నీలం డ్రెస్‌లో కనిపించే ఎస్పీజీ కమాండోలు ధోతీలు ధరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు స్పందించారు. ఎస్పీజీ కమాండోలు పంచెకట్టులో చాలా బాగున్నారని కొందరు ప్రశంసించారు. ప్రతి ఆలయంలో కూడా డ్రెస్ కోడ్ అమలు చేయాలని మరికొందరు సూచించారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం