
వారం రోజుల్లో నోటీసులకు స్పందించాలని, లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోటీసులపై అమెజాన్ స్పందించింది. సీసీపీఏ నుంచి నోటీసులు అందాయని, ఆయా సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ మేరకు సెల్లర్ల సేల్స్ ఆప్షన్‌ను తొలగించినట్టు చెప్పారు. కాగా, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కొందరు వ్యాపారులు దానిని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే ‘శ్రీరామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’, ‘రఘుపతి ఘీ లడ్డూ’, ‘అయోధ్య రామ్ మందిర్ ప్రసాద్’, ‘ఖోయా ఖోబీ లడ్డూ’, ‘రామ్ మందిర్ అయోధ్య ప్రసాదం- దేశీ ఆవు పేడా (స్వీట్)’ పేరుతో అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. సీసీపీఏ నుంచి నోటీసులు రావడంతో ఇప్పుడు వీటి సేల్స్‌ను అమెజాన్ నిలిపివేసింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు