16న ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోదీ

Narendra Modi, India's prime minister, gestures during a joint news conference with Kyriakos Mitsotakis, Greece's prime minister, in Athens, Greece, on Friday, Aug. 25, 2023. Modi arrived in Greece on Friday for talks to strengthen bilateral ties. Photographer: Yorgos Karahalis/Bloomberg via Getty Images

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి రానున్నారు. పాలసముద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరక్ట్ టాక్సెస్, అండ్ నార్కోటిక్స్ శిక్షణ కేంద్రాన్ని మోదీ ప్రారంభిస్తారు. విభజన చట్టంలో భాగంగా చంద్రబాబు హయాంలో దీన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. సుమారు 10 ఏళ్ళ తరువాత నిర్మాణ పనులు పూర్తి కావటంతో.. ప్రధాని మోదీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.

ఈ కేంద్రంలో ఐఆర్ఎస్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం కావటంతో.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ప్రధాని పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తారా..? లేదా..? అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరోవైపు ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించటం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రధాని రాజకీయ వ్యవహారల మీద కూడా ఫోకస్ చేస్తారా..? లేక కేవలం అధికారిక కార్యక్రమం వరకు పరిమితం అవుతారా..? అనేది తెలియాల్సి ఉంది.