కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం సరికాదని, కోనసీమ జిల్లాగానే ఉంచాలని ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఆందోళనకారులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన నిరసనకారుల మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోజుల తరబడి కర్ఫ్యూ విధించారు. ముమ్మడి వరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని కూడా ఆందోళన కారులు దగ్ధం చేశారు.
అల్లర్లు అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళన కారుల్ని అరెస్ట్ చేశారు. సీసీటీవీల ఆధారంగా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో అమాయకుల్ని ఇరికిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం ఈ కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అమలాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లోని క్రైమ్ నంబర్ 138/2022, 139/2022, 140/2022, 141/2022, తాలూకా పట్టణ పోలీసుస్టేషన్‌లోని క్రైమ్ నంబర్ 126/2022, 127/2022 కేసులను ఎత్తేస్తూ డిసెంబరు 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More Stories
వ్యక్తి నిర్మాణంతో వసుదైక కుటుంబమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు
డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ .. టిటిడి లో పెను దుమారం