‘‘సాహసాలు చేయాలనుకునేవారు లక్షద్వీప్‌ను మీ జాబితాలో చేర్చుకోండి. నా విడిది సమయంలో స్నార్కెలింగ్‌ని ప్రయత్నించాను. ఇది నిజంగా అద్భుతమైన అనూభూతి!’’ అంటూ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింతగా కష్టపడి ఎలా పని చేయాలో లక్షద్వీప్ ఆలోచన కలిగించింది’’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
సముద్ర గర్భం కింద ఉండే రాళ్లు, ఇసుక దిబ్బలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. సూర్యోదయాన అందమైన బీచ్‌లో తాను సాగించిన నడకను, అప్పుడు లభించిన ప్రశాంతతను కూడా ఆయన వివరించారు. అగట్టి, బంగారం, కవరట్టి దీపాల వాసులను కూడా కలుసుకున్నానని తెలియచేస్తూ వారి ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తన లోద్వీప్ పర్యటన ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని, నేర్చుకునే అవకాశాన్ని కల్పించిందని ఆయన పేర్కొన్నారు. లక్షద్వీప్ అనేది కేవలం కొన్ని ద్వీపాల సమూహం మాత్రమే కాదని, కాలాతీత సాంపద్రాయ వారసత్వమని, అక్కడి ప్రజల స్ఫూర్తికి నిత్య పరీక్ష అని ఆయన తెలిపారు.
మరింత అభివృద్ధిగా చేయడం, మెరుగైన ఆరోగ్య రక్షణ కోసం అవకాశాలు కల్పించడం, వేగవంతమైన ఇంటర్‌నెట్ సౌకర్యం,ద్వారా లక్షద్వీప్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు అదే సమయంలో వారి స్థానిక సంస్కృతిని పరిక్షించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్షమని ప్రధాని తెలిపారు. లక్షద్వీప్‌లో రూ. 1,150 కోట్లతో తాను ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని మోదీ వివరించారు.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!
కేరళలో ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్లకు 6 శాతం రిజర్వేషన్లు