సీనియర్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్, వినేష్ ఫోగాట్‌ల కారణంగా తమ కెరీర్లో ఒక ఏడాదిని కోల్పోయామని ఆందోళన వ్యక్తంచేస్తూ సీనియర్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్, వినేష్ ఫోగాట్‌ల కారణంగా తమ కెరీర్లో ఒక ఏడాదిని కోల్పోయామని నిరసన చేపట్టారు. ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఢిల్లీల నుండి బస్సుల్లో వందలాది మంది జూనియర్ రెజ్లర్లు జంతర్‌మంతర్ చేరుకున్నారు.
వీరిలో సుమారు 300 మంది ఛప్రౌలీ, బాగ్‌పట్‌లోని ఆర్యసమాజ్ అఖారా నుండి, అలాగే నరేలాలోని వీరేదర్ రెజ్లింగ్ అకాడమీ నుండి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బజరంగ్పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఈ ముగ్గురు రెజ్లర్ల నుండి తమ రెజ్లింగ్‌ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్లుడబ్ల్యు) కాపాడాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఆప్రాంతమంతా భారీగా భద్రతా దళాలను మోహరించారు.
దాంతో ఆరు వారాల్లో అండర్ -15, అండర్ – 20 నేషనల్ ఛాంపియన్షిప్స్ నిర్వహిస్తామని తెలిపింది. గ్వాలియర్ (మధ్యప్రదేశ్) వేదికగా ఈ పోటీలు ఉంటాయని అడ్‌హక్ కమిటీ చైర్మన్ భూపీందర్ సింగ్ బజ్వా ఓ ప్రకటనలో వెల్లడించారు. యువ రెజ్లర్లు ఈ పోటీలకు సన్నద్ధం కావాలని కోరారు.
మరోవంక, సంజయ్ సింగ్ లేకుండా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) నూతన పాలకవర్గంతో తనకు ఎలాంటి సమస్యలు లేవని రెజ్లర్ సాక్షి మాలిక్ ప్రకటించారు. పైగా, ‘గత రెండు మూడు రోజులుగా బ్రిజ్ భూషణ్ గుండాలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. మా అమ్మకు ఫోన్ చేసి వేధిస్తున్నారు. అంతేకాదు చాలామంది మా మా కుటుంబంలో ఒకరిపై కేసు పెట్టాలని అంటున్నారు. మా కుటుంబానికి, తోటి రెజ్లర్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని ఆమె ఆరోపించారు.
గతేడాది డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు, ఆయనను అరెస్టు చేయాలని ఈ ముగ్గురితో పాటు మరికొందరు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద జనవరి, ఏప్రిల్‌లో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. 2023 మొత్తం రెజ్లర్ల నిరసనలు, డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం కారణంగా ఆ ఏడాది అటు సీనియర్ గానీ ఇటు జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ నిర్వహించలేదు.
కొద్దిరోజుల క్రితమే అడ్‌హక్ కమిటీ ఫిబ్రవరి 2 నుంచి సీనియర్ నేషనల్ ఛాంపియన్స్ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్, సబ్ జూనియర్ లెవల్లో కూడా నేషనల్స్ నిర్వహిస్తామని స్పష్టతనివ్వడం గమనార్హం. అడ్‌హక్ కమిటీ తాజా ప్రకటన ప్రకారం ఫిబ్రవరిలో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత జూనియర్ నేషనల్స్ మొదలయ్యే అవకాశముంది.

More Stories
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ
లింగ నిష్పత్తిలో కేరళ ఆదర్శవంతం
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం