
దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్షం డెమోక్రెటిక్ పార్టీ అధినేత లీ జే-మియుంగ్‌పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆయన మెడపై అకస్మాత్తుగా కత్తితో పొడిచాడు. బూసాన్ నగరంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనకు లీ వెళ్లిన సందర్భంగా ఈ దారుణం జరిగింది.
ఈ ఘటనలో మ్యూగ్ మెడకి గాయమై వెంటనే కిందపడిపోయారు. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఆసుపత్రకి తరలించారు. కాగా, ఈ ఘటన అనంతరం దుండగుడు పారిపోతుండగా అక్కడున్నవారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 20 నుంచి 30 ఇంచుల పొడవున్న కత్తితో దుండగుడు దాడిచేసినట్లు అధికారులు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, లీపై దాడికి పాల్పడ్డ నిందితుడికి సుమారు 60 ఏళ్లు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ స్థల పరిశీలనకు వచ్చిన లీజే మియుంగ్‌ను ఆటోగ్రాఫ్ కోసం సమీపించిన నిందితుడు ఆ తరువాత ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు.
చేతిలో కత్తితో లీ మెడలో పొడించాడు. అయితే, పక్కనున్న ఇతరులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడితో కుప్పకూలిపోయిన లీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, 2022లో జరిగిన ఎన్నికలలో లీ స్వల్ప తేడాతో ఓడిపోగా సుక్ యిలోల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత సెప్టెంబర్‌లో 24 రోజులపాటు నిరసన దీక్ష చేశారు.
దక్షిణకొరియాలో ఇలాంటి రాజకీయదాడులు గతంలోనూ అనేకం జరిగాయి. తుపాకీలపై ఆంక్షలు ఉండటంతో ఇతర ఆయుధాలతో నిందితులు దాడులకు తెగబడ్డారు. 2006లో అప్పటి ప్రతిపక్ష అధినేత పార్క్ గ్యున్ హై ముఖంపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయం కావడంతో ఆమెకు సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్