స్వావలంబనంగా మార్చెది భారతీయ నమూనానే

భారతీయ నమూనా అన్ని అంశాలలో సమాజాన్ని స్వావలంబనగా మార్చడానికి శక్తినిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అస్సాంలోని  మజులిలో జరిగిన లూయిట్ సుబంసిరి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారత దేశపు కాల పరీక్షకు నిలబడిన స్వీయ పద్దతుల ఆధారంగా మనం మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు.
 
మనం కష్టపడి సంపాదించిన రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించినప్పటికీ, భారత్‌లో `స్వీయత’ను నిలుపుకో గలిగామా? అని ఆయన ప్రశ్నించారు. భారతీయులలో దేశభక్తి, ఐక్యత లేకుంటే చిరకాల స్వాతంత్ర్యం ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు.  ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు వెనుక ప్రధాన కారణం సమాజాన్ని దేశభక్తి, సంఘటిత, స్వశక్తితో మేల్కొల్పడమేనని డాక్టర్ భగవత్ చెప్పారు.
 
మన కాలం పరీక్షించిన సంప్రదాయ జ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ జ్ఞానం ద్వారా మన `స్వీయ’ అనేది తరాల అవసరాలపై ఆధారపడి ఉండాలని ఆయన సూచించారు. మన స్వంత దానితో పాటు ప్రపంచం మొత్తం నుండి అత్యుత్తమ జ్ఞానాన్ని పొందాలని స్పష్టం చేశారు. 
భౌతికవాద ఆకాంక్షలపై ఆధారపడిన లోపభూయిష్ట నమూనాల కారణంగా గత కొన్ని శతాబ్దాలుగా ప్రపంచం వివిధ సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన అదే సమయంలో హెచ్చరించారు.
 
అయితే, హిందుకుష్ పర్వతం నుండి అరకాన్ వరకు పురాతన భారతదేశం తన భౌగోళిక భూభాగం కారణంగా బాహ్య దురాక్రమణల నుండి సురక్షితంగా ఉన్నందున, మన పూర్వీకులు ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా, భౌతికంగా అభివృద్ధిలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి తగినంత శాంతియుత సమయాన్ని ప్రసాదించారని ఆయన గుర్తు చేశారు.
 
రసాయన ఎరువులపై ఆధారపడిన వ్యవసాయ అభివృద్ధి అవసరం లేదని స్పష్టం చేస్తూ ఇది చివరికి ప్రజలపై దుష్ప్రభావాలను కలిగిస్తోందని డా. భగవత్ వారించారు. మహాపురుష్ శంకర్‌దేవ్, లచిత్ బోర్ఫుకాన్ మొదలైన మన మహిమాన్విత వ్యక్తులు చూపిన గొప్ప మార్గాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
 
క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల గొప్ప ధర్మాలు అలవాట్లుగా మారతాయన్నది సార్వత్రిక సత్యం అని చెబుతూ మనం  ఆర్ఎస్ఎస్  శాఖలలో స్పష్టం చేసే పద్ధతి ఇదేమని పేర్కొన్నారు. ప్రపంచ సంక్షేమం పట్ల నిబద్ధతతో కూడిన సాధికారత కలిగిన దేశాన్ని తయారు చేసేందుకు ఈ వ్యక్తిగత మంచి అలవాటును వ్యవస్థీకృత ప్రయత్నంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
 
ఈ వ్యవస్థీకృత కృషిని ఒక పెద్ద కుటుంబపు సోదర స్ఫూర్తితో ప్రారంభించాలని చెప్పారు. గొప్ప భారతీయ విలువ మనకు రెండు చేతులతో సంపాదించడం నేర్పుతుందని గుర్తు చేస్తూ అదే మరోవంక వెయ్యి చేతుల్లో సహాయం అందించేందుకు దోహదపడుతుందని తెలిపారు.
 
భూమ్మీద ప్రజలు సెక్యులరిజం గురించి బిగ్గరగా మాట్లాడతారని, అయితే వాస్తవానికి భారత్ యుగయుగాల నుంచి దానిని పాటిస్తున్నదని డా. భగవత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కేవలం ప్రపంచ సంక్షేమ సాధనంగా మారాలని కోరుకుంటోందని తెలిపారు.  అయితే, సమాజంలో ఒక ప్రత్యేక సమూహాన్ని సృష్టించడం ద్వారా కాకుండా మన వ్యక్తిగత స్వార్థ వైఖరిని పక్కనపెట్టి మన సమాజం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఈ లక్ష్య సాధనకు కృషి చేస్తుందని వివరించారు.