ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లిలో నివశిస్తున్న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ కుటుంబంలో నలుగురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి పట్టణంలో గుంటూరు జిల్లాకు చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ తన భార్య, ముగ్గురు కుమార్తెలతో నివాసముంటున్నారు. గురువారం రాత్రి వీరంతా సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, శివరామకృష్ణతో పాటు భార్య మాధవి, కుమార్తెలు వైష్ణవి, జహ్నవి లక్ష్మీ మృతి చెందారు. చిన్నా కుమార్తె కుసుమ ప్రియ అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం
అమరావతికి ప్రపంచ బ్యాంకు మరో రూ 1700 కోట్లు
హిందూ దేవుళ్లను దూషించారని రాంగోపాల్వర్మపై కేసు