ఇస్లామిక్ టెర్రరిజంతో.. ఇంటర్నెట్‌ వ్యవస్థకు పెనుముప్పు..!!

ప్రపంచానికి ఇస్లామిక్ తీవ్రవాదం పీడలాగా తయారైంది. ఇస్లామిక్ మిలిటెంట్లు ఎక్కడ ఉన్నా.. అక్కడ అశాంతే. వాళ్లు ఎక్కడున్నా.. అక్కడ వినాశనమే. ఇతర మతస్తులు కాఫీర్లు అని.. వారిని చంపితే తమ దేవుడు సంతోషిస్తాడనే పనికిరాని గుడ్డి విశ్వాసంతో మారణహోమాన్ని సృష్టించేందుకు వెనుకాడరు. అలాంటి ఎన్నో ఉదాహరణలు మనకళ్లముందే కనిపిస్తాయి. కశ్మీర్ లో హిందూ పండిట్లపై జరిగిన ఊచకోత.. దాచినా దాగని చరిత్ర అది. ఒక్క హిందువులే కాదు.. ముస్లిం మతోన్మాదులు అడుగుపెట్టిన ప్రతీ చోట.. అక్కడున్న ఇతర మతస్తులను చంపడమే పనిగా పెట్టుకుంటారు. అఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, లెబనాన్ ఇలా.. ఇస్లామిక్ తీవ్రవాదులు ఉన్న ప్రతీ చోటా మరణమృదంగమమే.
తాజాగా హమాస్ ఉగ్రవాదులకు వంత పాడుతున్న హౌతీలు కూడా అదే రీతిన రెచ్చిపోతున్నారు. ఇరాన్ నుంచి అందుతున్న ఆయుధాలతో సముద్రంలో వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కు మద్దతిస్తున్న దేశాలకు చెందిన భారీ ఓడలే లక్ష్యంగా డ్రోన్ దాడులకు పాల్పడుతున్నారు. మరో అడుగు ముందుకేసి.. ప్రపంచాన్ని అనుసంధానం చేస్తున్న ఇంటర్నెట్ వ్యవస్థను సైతం ధ్వంసం చేయాలని చూస్తున్నారు. సముద్రంలో ఇంటర్నెట్ తీగలను కట్ చేస్తామని.. ప్రపంచం ఇంటర్నెట్ కు దూరం అవుతుందని.. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు.. ఎర్రసముద్రంలో మోహరించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. “బాబ్‌ అల్‌ మందబ్‌” జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్‌ కేబుళ్లను కత్తిరిస్తామని స్పష్టం చేశారు. అదే జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయంటూ.. సోషల్‌ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఎర్రసముద్రంపై సేనల మోహరింపు విషయంలో అమెరికా నిర్ణయానికి ఇటలీ, స్పెయిన్‌ మద్దతిస్తాయనే వార్తలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ ఉగ్రవాదులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. “తాము తీసుకునే నిర్ణయంతో ప్రపంచం రాతియుగంలోకి వెళ్లిపోతుంది. ఇక కాచుకోండి.” అంటూ సవాల్‌ విసిరారు. అయితే హౌతీ ఉగ్రవాదుల వార్నింగ్ పై.. అరబ్‌ మీడియాతో పాటు.. అంతర్జాతీయ మీడియా పలు కథనాలను ప్రచురించాయి. హౌతీలను కట్టడి చేయకుంటే.. ప్రపంచానికి నెట్‌వర్క్‌ సమస్య ఏర్పడుతుందని ఆయా కథనాల్లో ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే హౌతీల తాజా వార్నింగ్ పై భారత్ మాత్రం ప్రత్యేకంగా స్పందించింది. ఇంటర్నెట్ విషయంలో తమకెలాంటి సమస్య రాబోదని స్పష్టం చేసింది. కేబుళ్లు కట్ చేసినా.. తమ దేశానికి పెద్ద ప్రమాదమేమీ లేదని.. ప్రకటించింది.
భారత టెలీకమ్యూనికేషన్ శాఖ వెల్లడించిన విషయం ప్రకారం.. మనదేశం విషయానికి వస్తే.. చెన్నై, పుదుచ్చేరి, కోల్‌కతా, ముంబై పోర్టుల నుంచి ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ హబ్ లు ఉన్నాయని తెలిపింది. ఏదైనా ఒక మార్గంలో సమస్యలు తలెత్తితే.. మరో మార్గం గుండా అనుసంధానం చేయొచ్చని వివరించింది. మొత్తం మీద.. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థన స్తంభింప చేస్తామనే హౌతీ తీవ్రవాదుల హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి. తమ లక్ష్యాలను సాధించుకోవటానికి ఎంతకైనా తెగించే లక్షణం ఇస్లామిక్ తీవ్రవాదులకు ఉండటంతో.. అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం ఒక్కతాటిపైకి రావాలని కోరుతున్నాయి.