
ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న చలాన్లపై భారీ ఎత్తున రాయితీ ఇచ్చేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది కూడా పెండింగ్ చలానాలపై రాయితీ ఇవ్వగా ఏకంగా రూ.300 కోట్ల వరకు చలానాలు వసూలయ్యాయి. దీంతో ఈ ఏడాది కూడా మరోసారి చలాన్లపై డిస్కౌండ్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది.
అయితే గతంలో ఇచ్చిన రాయితీ కన్నా ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించారు. 50 నుంచి 90 శాతం వరకు ఆయా వాహనాలపై రాయితీ ఇస్తూ, పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకుని అద్బుత అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం డిసెంబర్ 26 నుంచి జనవరి 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
- ఈనెల 26 నుంచి జనవరి 10 వరకు చలాన్లు రాయితీతో కట్టే అవకాశం
- ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీ
- ద్విచక్రవాహనాల చలాన్లకు 80 శాతం రాయితీ
- ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం రాయితీ
- లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కు 50 శాతం రాయితీ
ఈ పెండింగ్ చలాన్లను ఆన్‌లైన్‌తో పాటు మీసేవా సెంటర్లలలో డిస్కౌంట్‌తో కట్టే అవకాశాన్ని కల్పించారు పోలీసులు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. పెండింగ్ చలానాలపై భారీ ఎత్తున రాయితీలు ప్రకటించటంతో వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్లియర్ చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత