
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో సోమవారం వారణాసి నుండి ఢిల్లీకి మరొక కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. వారణాసి- ఢిల్లీ మార్గంలో రెండవ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాశీలోని ధార్మిక ప్రదేశాలకు ప్రయాణ, పర్యాటకానికి ప్రాప్యతను మెరుగుపరిచేందుకు వేగంగా ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉందని రైల్వలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
అదునాతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ రైలుకు భారత ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పలు గూడ్స్ రైళ్లను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ వందే భారత్ రైలు మంగళవారం మినహాయించి మిగతా ఆరు రోజుల్లో ఉదయం 6 గంటలకు వారణాసిలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటుంది.
ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 5 నిమిషాలకు తిరిగి వారణాసికి చేరుకుంటుంది. ఇప్పటికే వారణాసి ఢిల్లీ మార్గంలో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుండగా, రద్దీ నేపథ్యంలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఈ మార్గంలో ప్రారంభించారు. ఈ రైలులో అధునాతన ఫీచర్లు ఉంటాయి.
వైఫై సదుపాయం, జిపిఎస్ ఆధారిత ఇన్ఫర్మేషన్ సిస్టం, బయో వాక్యూం టాయిలెట్స్, ప్రతి సీటు వద్ద చార్జింగ్ పాయింట్లు, టచ్ బేస్డ్ రీడింగ్ లైట్లు వంటి అధునాతన సౌకర్యాలతో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా