* ఆందోళన కలిగిస్తున్న జేఎన్-1 అనే కొత్త కరోనా వేరియంట్
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు కేరళలోనే ఉండటం గమనార్హం. కేరళలో జేఎన్-1 అనే కొత్త కరోనా వేరియంట్ బయటపడటంతో ఆందోళన కలిగిస్తున్నది. ఈ సబ్ వేరియెంట్‌ను మొదటగా సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు.
ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్‌కి సంబంధించిన ఏడు కేసులనే చైనాలో కూడా గుర్తించారు. ఆ తరహాలోనే తొలి కేసు ఇప్పుడు మన దేశంలోనూ కేరళలోని తిరువనంతపురంలో నమోదవడంతో కలవరం చెలరేగుతుంది. ఈనెల ఎనిమిదో తేదీన కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్‌కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు.
ఇది సులభంగా సోకే సామర్థ్యం ఉన్న వ్యాధిగా కనపించడమే శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. దాంతోపాటు ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త రకం కరోనాను పిరోలా వేరియంట్, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వారసురాలిగా చెబుతున్నారు. జేఎన్.1 కొత్త కరోనా స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్ కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకడంలో స్పైక్ ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తోంది.
అమెరికాలో 15 నుంచి 29 శాతం కొత్త రకం కరోనా కేసులు నమోదైనట్టు అంచనా వేస్తున్నారు. జెఎన్.1 నూతన కరోనా లక్షణాల విషయానికొస్తే.. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు, కొన్ని సందర్భాల్లో తేలికపాటి జీర్ణాశయ సమస్యలు ఈ వైరస్ సోకిన వారిలో కనిపిస్తుంది.
అమెరికాలో 15 నుంచి 29 శాతం కొత్త రకం కరోనా కేసులు నమోదైనట్టు అంచనా వేస్తున్నారు.
జెఎన్.1 నూతన కరోనా లక్షణాల విషయానికొస్తే జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు, కొన్ని సందర్భాల్లో తేలికపాటి జీర్ణాశయ సమస్యలు ఈ వైరస్ సోకిన వారిలో కనిపిస్తుంటాయి. సరైన నివారణ చర్యలు పాటించకపోతే గతంలో మాదిరిగానే ఈ కొత్త వైరస్ ఎక్కువ మందికి వ్యాపించే అవకాశాలున్నాయి.
శానిటైజేషన్‌తో తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్కులు వాడడం, సామాజిక దూరం పాటించడం వంటి మార్గాల ద్వారా కరోనా సోకకుండా తప్పించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వీటితోపాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తవానికి జేఎన్-1 వేరియెంట్ భారతీయులకు సోకడం అధికారికంగా ఇదే తొలిసారి. కానీ కొన్ని నెలల కిందటే సింగపూర్ ఎయిర్‌పోర్టులో కొందరు భారతీయుల్లో ఈ కొత్త వేరియెంట్‌ను గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెబుతున్నారు
ప్రస్తుతం దేశంలో 1,701 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు (4,50,04,816) దాటింది. వీరిలో 4.46 కోట్ల మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వల్ల 5,33,316 మంది మరణించారని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 220.67 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు చెప్పింది.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు